హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఆ 12 మంది ఎమ్మెల్యేలపై డీజీపీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు

Telangana: ఆ 12 మంది ఎమ్మెల్యేలపై డీజీపీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎందుకంటే?

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ కోరారు. రేవంత్ వెంట మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.  నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్రం చేసిందని కేసీఆర్ ఎలాగైతే ఆరోపిస్తున్నారో..  ఇప్పుడు అచ్చం అలాగే.. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని రేవంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telangana High Court: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం..రైతుల పిటీషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

2018 ఎన్నికల్లో మొత్తం 19 సీట్లలో కాంగ్రెస్  పార్టీ విజయం సాధించింది. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో..  నల్గొండ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. హుజూర్‌నగర్ నుంచి తన భార్యను రంగంలోకి దింపారు. ఆ ఎన్నికల్లో పద్మావతి రెడ్డి ఓడిపోవడంతో... అసెంబ్లీ కాంగ్రెస్ బలం 18కి పడిపోయింది. ఐతే ఆ ఉన్న 18 ఎమ్మెల్యేల్లో ఏకంగా 12 మంది హస్తం పార్టీకి హ్యాండిచ్చారు. కాంగ్రెస్‌ను వీడిని టీఆర్ఎస్‌లో చేరారు.

KCR-Khammam: బీఆర్ఎస్‌లో ఆ ముఖ్యనేత పరిస్థితి ఏంటి.. నేటి కేసీఆర్ భేటీతో తేలిపోనుందా ?

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వారిలో...  పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు , పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి , కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య , మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ , కొల్లాపూర్ నుండి బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండుర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు. వీరిలో సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవిలో ఉన్నారు. ఇప్పుడు వీరందరిపై పోలీసులకు టీపీసీసీ ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది.

మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో మునుగోడు ఎమ్మెల్యే గత ఏడాది కాంగ్రెస్ పార్టీని బీజేపీలో చేరారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకి పడిపోయింది. ప్రస్తుతం మంథని నుంచి శ్రీధర్ బాబు, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, ములుగు నుంచి సీతక్క, మధిర నుంచి మల్లు భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పొదెం వీరయ్య మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

First published:

Tags: Congress, Mp revanthreddy, Telangana

ఉత్తమ కథలు