హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: గవర్నర్ వర్సెస్ సీఎం..ఈసారైనా కేసీఆర్ వచ్చేనా? అందరి కళ్లు ఆరోజుపైనే!

Telangana: గవర్నర్ వర్సెస్ సీఎం..ఈసారైనా కేసీఆర్ వచ్చేనా? అందరి కళ్లు ఆరోజుపైనే!

గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్లుండి (జనవరి 26న) జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలపై అందరి కళ్లు ఉన్నాయి. ఈసారైనా రాజ్ భవన్ లో జరగబోయే వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా గతేడాదిలాగే ఈసారి ప్రగతిభవన్ లో జరిగే కార్యక్రమాలకే పరిమితం అవుతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్లుండి (జనవరి 26న) జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలపై అందరి కళ్లు ఉన్నాయి. ఈసారైనా రాజ్ భవన్ లో జరగబోయే వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా గతేడాదిలాగే ఈసారి ప్రగతిభవన్ లో జరిగే కార్యక్రమాలకే పరిమితం అవుతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

Telangana: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..ఇంతకీ సైబర్ నేరగాళ్లు ఏం చేశారంటే?

2019లో తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై పబ్లిక్ గార్డెన్ లో జరిగిన 2020, 2021 గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అయితే కరోనా కారణంగా 2022లో మాత్రం గణతంత్ర వేడుకలు పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించడం లేదని ప్రభుత్వం గవర్నర్ కార్యాలయం రాజ్ భవన్ కు సమాచారం ఇచ్చింది. అయితే ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. అప్పటి నుంచి పెండింగ్ బిల్లులు సహా ఇతర అంశాలపై గవర్నర్ పై కేసీఆర్ అసహనంతో ఉన్నారు. దీనితో అటు గవర్నర్ రాజ్ భవన్ కు ఇటు కేసీఆర్ ప్రగతిభవన్ కు మధ్య దూరం బాగా పెరిగింది.

Telangana: గవర్నర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలా? కేసీఆర్ సర్కార్ పై బండి సంజయ్ ఫైర్

ఈసారైనా కేసీఆర్ వచ్చేనా?

ఇక రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ గవర్నర్ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో గవర్నర్ తీరును మంత్రులు, ప్రభుత్వ అధికారులు తప్పుబట్టారు. మొన్న రాష్ట్రపతి రాక సందర్భం మినహా ఈ రెండేళ్లలో గవర్నర్, కేసీఆర్ కలిసిన సందర్భాలు లేవు. దీనితో ఈసారి జరగబోయే గణతంత్ర వేడుకలపై అందరి దృష్టి నెలకొంది. అయితే ఈ ఏడాది కూడా ఈ వేడుకలను రాజ్ భవన్ లోనే నిర్వహించాలని ప్రభుత్వం  నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అందుకే ఇప్పటివరకు కూడా గణతంత్ర వేడుకలపై ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదని తెలుస్తుంది. సీఎం కేసీఆర్ గతేడాది లాగే ఈసారి కూడా రాజ్ భవన్ కు వచ్చే అవకాశం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 26న ప్రగతిభవన్ కార్యక్రమాలకే కేసీఆర్ పరిమితం కానున్నారని సమాచారం.

మరోవైపు ఫిబ్రవరి 3వ తేదీ నుండి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అవ్వాలి. కానీ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి గవర్నర్ ప్రసంగం ఉండకపోవచ్చని తెలుస్తుంది. కాగా గతేడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిన విషయం తెలిసిందే. మరి ఈ రెండు రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

First published:

Tags: Governor Tamilisai Soundararajan, Kcr, Telangana, Telangana News

ఉత్తమ కథలు