గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) చేసిన ప్రసంగం ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటికే తెలంగాణ (Telangana)లో రాజ్‌భవన్, ప్రగతిభవన్‌కు గ్యాప్ పెరిగింది. సీఎం కేసీఆర్ (CM KCR), గవర్నర్ తమిళిసై మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఈ క్రమంలో రిపబ్లిక్ డే ప్రసంగంలో ఆమె ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్ర రాజకీయాలను మళ్లీ వెడెక్కించాయి. భవనాలు కట్టినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్లు కాదని.. తానంటే కొందరికి నచ్చడం లేదని తమిళిసై అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో రాజ్‌భవన్ పాత్ర కూడా ఉందని చెప్పారు. ఐతే ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉండి..రాజకీయాలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad: రిపబ్లిక్ డే స్పీచ్‌లో గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు
''గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ రాజకీయాలు మాట్లాటడం సరైన పద్దతి కాదు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడారు. గవర్నర్ వైఖరిపై రాష్ట్రపతి కల్పించుకోవాలి. ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాస్తాను. రాజ్యాంగాన్ని అమలు చేసే రోజును రాజకీయాల కోసం వాడుకోవడం తగదు. '' అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
Telangana: తెలంగాణలో పెరిగిపోయిన విద్యుత్ చౌర్యం..నిరోధించేదెలా?
అంతకుముందు రాజ్‌భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రసంగించిన తమిళిసై సౌందరరాజన్.. సీఎం కేసీఆర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడదామని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని అన్నారు.
'' కొత్త భవనాలు నిర్మించడమే అభివృద్ధి కాదు. జాతిని నిర్మాణమే నిజమైన అభివృద్ధి. రైతులకు పొలాలు, ఇళ్లు ఉండాలి. ఫామ్ హౌజ్‌లు కాదు. అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేయాలి. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు మన యూనివర్సిటీల్లో ఉండడమే నిజమైన అభివృద్ధి అంతేతప్ప. మన పిల్లలు మాత్రమే విదేశాల్లో చదువుకోవాలనేది నిజమైన అభివృద్ధి కాదు. మనదేశంలో 60శాతం మంది యువతే ఉన్నారు. మనది యంగ్ ఇండియా. తెలంగాణలో సగటున రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడదాం.. తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. తెలంగాణ హక్కును నిలబెట్టుకుందాం.'' అని తెలంగాణ ప్రభుత్వానికి తమిళిసై సౌందరరాజన్ చురకలంటించారు.
తెలంగాణ ప్రజల అభ్యున్నతిలో తన పాత్ర తప్పకుండా ఉంటుందని తమిళసై సౌందర్ రాజన్ అన్నారు. కష్టపడడం, నిజాయతీ, ప్రేమ.. తన పెద్ద బలాలని ఆమె చెప్పుకొచ్చారు. కొంత మందికి తానంటే నచ్చకపోవచ్చని.. కానీ తనకు తెలంగాణ వారంటే ఎంతో ఇష్టమైని అన్నారు. అందుకే ఎంత కష్టమైనా పనిచేస్తానని స్పష్టం చేశారు గవర్నర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Talasani Srinivas Yadav, Telangana