హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు ..చర్గపల్లి జైలుకు తరలించే ఛాన్సు

Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు ..చర్గపల్లి జైలుకు తరలించే ఛాన్సు

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి అరెస్ట్ అయ్యారు. మూడ్రోజుల క్రితమే అరెస్టై బెయిల్‌పై విడుదలైన రాజాసింగ్‌ని మంగళ్‌హాట్‌ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం పాత కేసుల విషయంలో నోటీసులు ఇచ్చి కొద్ది సేపటి క్రితమే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌( MLA Rajasingh)మరోసారి అరెస్ట్ అయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో మూడ్రోజుల క్రితమే అరెస్టై బెయిల్‌పై విడుదలైన రాజాసింగ్‌పై మంగళ్‌హాట్‌,షాహినాయత్‌గంజ్ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం ఇంటికి వెళ్లిన పోలీసులు పాత కేసుల విషయంలో 41ఏ సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులిచ్చారు. 24గంటల్లో వివారణ ఇవ్వాలని కోరారు. అయితే అరెస్ట్‌కు ముందే రాజాసింగ్‌ తనను పాతకేసుల్లో ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని వీడియో రిలీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని కొద్ది సేపటి క్రితమే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓల్డ్ సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో ఆయన్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


Raja singh: BJP ఎమ్మెల్యే రాజాసింగ్​ చుట్టు ఉచ్చు బిగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం!పీడీ యాక్ట్ నమోదు...చర్లజైలుకే ..
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌ చేయడమే కాదు ఆయనపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు పోలీసులు. 2004 నుంచి రాజాసింగ్‌పై 101 కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 18 కేసులు కేవలం మత‌ప‌ర‌మైన‌ విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవే కావడం విశేషం. పీడీయాక్టు న‌మోదుతో రాజాసింగ్‌కు బెయిల్ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని న్యాయ‌నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల చ‌రిత్ర‌లోనే ఒక ఎమ్మెల్యేపై పీడీయాక్టు న‌మోదు కావ‌డం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీయాక్ట్ న‌మోదు చేసిన మంగళహాట్‌ పోలీసులు చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లించారు.రెండో సారి ..

వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను మంగళ్‌హాట్‌కి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో రెండ్రోజుల క్రితమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అటుపై నాంపల్లి(Nampally Court) కోర్టులో ప్రవేశపెట్టారు. 14వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాజాసింగ్‌కు 14రోజుల రిమాండ్‌ విధించింది. అయితే ఆ తర్వాత రాజాసింగ్‌ తరపు లాయర్ బెయిల్‌ పిటిషన్ (Bail Petition)దాఖలు చేశారు. ఎమ్మెల్యే బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. అయితే సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 41సీఆర్‌పీసీ(CRPC) పాటించకుండా ఎలా రిమాండ్‌ చేస్తారని న్యాయవాది కోరారు. పోలీసుల తరపు న్యాయవాది పాత కేసులను పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టు కోరడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తులో పోలీసు అధికారులకు సహాకరించాలని ఆదేశించింది.

Published by:Siva Nanduri
First published:

Tags: Raja Singh, Telangana News

ఉత్తమ కథలు