Home /News /telangana /

HYDERABAD REDUCE THE AGE OF BOY FOR GETTING MARRIAGE SAID MP ASADUDDIN OWAISI VRY

MP Asaduddin owaisi : పెళ్లి వయస్సు పెంచడం కాదు.. మగాళ్ల వయస్సును తగ్గించండి...

MP Asaduddin owaisi

MP Asaduddin owaisi

MP Asaduddin owaisi : 18 ఏళ్ల వయస్సులో దేశ ప్రధానినే ఎన్నుకునే అవకాశం ఉన్నప్పుడు తన స్వంత భవిష్యత్‌ను నిర్ణయించే పెళ్లిని ఎందుకు చేసుకోకుడదంటూ.. ఎమ్ఐఎమ్ నేత ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ ప్రశ్నించారు.

    ఆడపిల్లల పెళ్లిలు 18 సంవత్సరాల నుండి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే..అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి...ఈ క్రమంలోనే ఎమ్‌ఐఎమ్ నేత ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ పెళ్లి వయస్సు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 18 సంవత్సరాల వయస్సులో ఓటింగ్‌లో పాల్గోని దేశ ప్రధానులను ఎన్నుకునే పరిస్థితి ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే వయస్సుకు ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. 18 ఏళ్లు నిండినవారు ప్రధానమంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకొగల్గుతారని,అదే విధంగా వ్యాపారపరంగా జరిగే వివిధ ఒప్పందాల్లో సంతకాలు పెట్టే అధికారం ఉంటుందని అన్నారు.ఇలాంటప్పుడు వారు పెళ్లి ఎందుకు చేసుకోకుడదంటూ ప్రశ్నించారు. మగాళ్ల పెళ్లి వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించాలని అన్నారు.

    మరోవైపు భారతదేశంలో బాల్య వివాహాలు తగ్గింది క్రిమినల్‌ చట్టాల వల్ల కాదని విద్య, ఆర్థిక ప్రగతి కారణంగానే తగ్గుముఖం పట్టాయని అన్నారు. అయినా.. దాదాపు 12 మిలియన్ల మంది పిల్లలకు 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు అవుతున్నట్లు ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయని దుయ్యబట్టారు. 2005లో శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం 26 శాతంగా ఉందని అది కాస్త 2020 నాటికి 16 శాతానికి తగ్గిందని అన్నారు.

    ktr : ఆ ప్రాంతాన్ని విలీనం చేయండి... లేదంటే.. అభివృద్ది చేయండి.. కేటిఆర్ ట్వీట్..


    అంతేకాదు తన దృష్టిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయసు 21 ఏళ్లు ఉండాలని నొక్కి చెప్పారు. ఈ క్రమంలో అమెరికాలో 14 ఏళ్లకు, బ్రిటన్‌, కెనడా వంటి దేశాల్లో 16 ఏళ్లకే వివాహం చేసుకునే హక్కు ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పైగా మహిళలు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎ‍ప్పుడూ బిడ్డని కనాలనేది ఆమె గోప్యతకు సంబంధిన ప్రాథమిక హక్కు అని, ఆ విషయాన్ని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసిందని అన్నారు.

    కాగా యూపి ఎన్నికల్లో భాగంగా ఆ పార్టీ నేత కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో ినిలిచాడు. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నప్పుడే రాజ్యాధికారం పొందవచ్చని అన్నారు. ఇలాంటీ సమయంలో ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను జన్మనివ్వాలని సూచించారు. అలాంటప్పుడే అసదుద్దిన్ ప్రధాని అయ్యె అవకాశాలు ఉన్నాయని అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆ నేత చేసిన వ్యాఖ్యలు కాస్త దుమారం రేపాయి.. తాజాగా అసదుద్దిన్ సైతం పెళ్లికి అబ్బాయిల వయస్సు సైతం తగ్గించాలని కోరడంతో ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

    CM KCR : భార్య,భర్తలు ఒకే దగ్గర పనిచేసే విధంగా చూడండి.. కలెక్టర్ల‌తో సీఎం


    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Asaduddin Owaisi, MIM

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు