గులాబ్ తుఫాన్(Gulab Cyclone) తీరంలో కల్లోలం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మహానగరంలో అన్ని ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తోంది. దీంతో రోడ్లపై లైట్లు వేసుకుని వాహనదారులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జంటనగరాల పరిధిలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.. దీంతో హైదరాబాద్ నగరవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తెలంగాణలోని ప్రతీ జిల్లాలో ఇదే వాతావరణంల నెలకొంది. ఇవాళ తెల్లవారుజాము నుంచే భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి.. మధ్యాహ్నం వరకే తెలంగాణలో 15 సెంటీ మీటర్లు, హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 3.3 సెంటీ మీటర్ల వర్షం నమోదు కాగా.. రాష్ట్రంలోని 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.
నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. వచ్చే 6 గంటల తుఫాన్‌గా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఈ తుఫాన్‌కు గులాబ్‌గా పేరు పెట్టారు. పాకిస్తాన్ ఈ పేరును సూచించింది.
ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు తూర్పు-ఆగ్నేయ దిశగా 470 కిలోమీటర్లు, ఏపీలోని కళింగ పట్నానికి 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఇకపోతే హైదరాబాద్ లో ఎక్కడిక్కడ మ్యాన్ హోల్స్ తెరుచుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ ఏ గుంట ఉంటుందో తెలియక ఇబ్బందులకు గురవుతున్నారు.
పెరుగు ప్యాకెట్ కోసం వెళ్లి.. అనంతలోకాలకు వెళ్లాడు..
ఇలా ఉండగా.. హైదరాబాద్ లోని ఈ నెల 25న రాత్రి కురిసిన వర్షానికి మణికొండలోని డ్రైనేజీలో ఓ సాఫ్టవేర్ ఇంజనీర్ రజనీకాంత్ గల్లంతయ్యాడు. ఈ రోజు ఉదయం అతడి మృతదేహం లభ్యమైంది. నెక్నాంపూర్ చెరువులో రజనీకాంత్ మృతదేహం లభ్యమైంది. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నాలాలు కలిసే చోట, నెక్నాంపూర్ చెరువు వద్ద గాలింపులో భాగంగా నెక్నాంపూర్ చెరువులో గుర్రపు డెక్క తొలగిస్తుండగా రజనీకాంత్ మృతదేహం బయటపడింది. రెండు రోజుల క్రితం పెరుగు ప్యాకెట్ కోసం వచ్చి మణికొండ డ్రైనేజీలో అతడు గల్లంతై దాదాపు మూడు కిలోమీటర్లు కొట్టుకుపోయాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Heavy Rains, Rains, Telangana rains