Eetala Rajender : ఉద్యోగులను నియమించుకోండి...రోగుల ప్రాణాలను కాపాడండి .. ఈటల రాజేందర్

మంత్రి ఈటల రాజేందర్

Eetala Rajender : రోగుల ప్రాణాలను కాపాడడమే ప్రధాన లక్ష్యంగా వైద్యశాఖ సిబ్బంది పని చేయాలని మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఇందుకు కావాల్సిన ఉద్యోగులను సైతం నిమమించుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

  • Share this:
కరోనా కట్టడి చేయడంతో వైద్యాశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రోగుల ప్రాణాలు పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఆశా వర్కర్ల పాత్ర ప్రస్థుతం చాల కీలకమైందని చెప్పారు. ప్రతి ఇంట్లో కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు ఆసుపత్రుల్లో కావాల్సిన సౌకర్యాలతో పాటు సిబ్బంది నియామాకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పాటు వైద్యాధికారులకు కావాల్సిన వెహికిల్స్ అలవెన్స్ కూడ అందేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

కరోనా సమయంలో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని ఆయన ఈ సంధర్భంగా అభినందించారు.ఇక జిల్లాల్లో టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉంచుకోవాలని ప్రతి ఒక్కరికి పరీక్షలు చేసి , వైద్యం అందించాలని కోరారు. ఇక ఆక్సిజన్ కోరతకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆయన చెప్పారు. కొవిడ్ పరీక్షకు ఎక్కడి నుండి వచ్చిన వెంటనే చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక కొవిడ్ పరీక్ష చేయకున్నా లక్షణాలు ఉంటే వెంటనే చికిత్సకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా కోవిడ్ సెంటర్లను పెంచడంతో పాటు అందుకు కావాల్సిన సదుపాయలను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.

ఇక మంత్రి సమీక్ష తర్వాత ప్రభుత్వం వైద్య శాఖలో ఖాలీలుగా కొన్ని పోస్టుల భర్తికి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్న వివిధ విభాగాల్లోని 449 ఉద్యోగాలల భర్తికి నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ఇందులో స్థాఫ్ నర్సులు 315 మంది , 56 మంది ల్యాబ్ టెక్నిషియన్లులతోపాటు పలువురు ప్రోఫెసర్లు అస్టిస్టెంట్ ప్రోఫెసర్లు కూడ ఉన్నారు.
Published by:yveerash yveerash
First published: