Home /News /telangana /

HYDERABAD RECORD BEER SALES IN TELANGANA SNR

Beer sales: కోట్ల లీటర్ల బీర్లు తాగిన మద్యం ప్రియులు..సర్కారు వారికి వచ్చిన ఆదాయం ఎంతంటే

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Telangana:ఈ ఏడాదిలో వేసవి తాపం భరించలేక తెలంగాణలో మందు ప్రియులు వేల కాటన్ల బీర్లను కాళీ చేశారు. కోట్ల లీటర్ల బీరుని గుటుక్కున మింగేశారు. గత రెండేళ్లుగా కరోనా భయంతో మద్యం, బీర్ల జోలికి పెద్దగా పోని మందుబాబులు ఈసారి మాత్రం రికార్డ్‌ స్థాయిలో సేల్స్ చేసి సర్కారు ఖజానా నింపేశారు.

ఇంకా చదవండి ...
తెలంగాణ(Telangana)లో ఎండలు ఏ రేంజ్‌లో ఉన్నాయో..మద్యం అమ్మకాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవి తీవ్రత నుంచి ఉపశమనం పొందాలనుకునే మద్యం ప్రియుల ఛాయిస్‌ బీర్‌లు( Beers) మారడంతో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో బీర్‌ల అమ్మకాలు జోరుగా జరిగాయి. కేవలం ఈ ఏడాది మార్చి(March)నెల నాటికి 6702కోట్ల రూపాయల(6702 Crores) బీర్లు అమ్ముడయ్యాయి. గతేడాది మే నెలతో పోలిస్తే ఈ సంవత్సరం బీర్ల అమ్మకాలు 90శాతం పెరిగినట్లుగా ఎక్సైజ్‌శాఖ(Excise Department) లెక్కలు చూపిస్తున్నాయి. ఈ స్థాయిలో అమ్మకాలు జరగడం గడిచిన మూడేళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. 2020,2021 ఏడాదిలో కరోనా మహమ్మారి కారణంగా బీర్లే కాదు మద్యం అమ్మకాలు కూడా పెద్దగా జరగలేదు. దీనికి తోడు చల్లని ఉత్పత్తులు, ద్రవ పదార్ధాలు తీసుకుంటే కరోనా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్న నిపుణుల సూచనలతో చాలా మంది బీర్లు తాగడం తగ్గించడంతో గత రెండు సీజన్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో బీర్ల అమ్మకాలు జరగలేదు. ప్రస్తుతం కరోనా(Corona) ప్రభావం ఎక్కడా కనిపించకపోవడం, మరోవైపు ఎండలు మండిపోతుండటంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా జంటనగరాల పరిధితో పాటు రంగారెడ్డి(Rangareddy)జిల్లాలో వేల కాటన్ల బీర్లు తాగేసినట్లుగా సమాచారం. బీర్ల అమ్మకాల్లో తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. 2.38కోట్ల లీటర్ల(2.38 Crore liters)బీరును గుటకేశారు మందుబాబులు. వరంగల్(Warangal)జిల్లా బీర్‌ సేల్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 1.15కోట్ల లీటర్ల(1.15 Crore liters)బీర్‌ ఏరులై పారింది. కేవలం ఒక్క మే నెలలోనే తెలంగాణ వ్యాప్తంగా 10.64కోట్ల లీటర్ల బీరును తాగేశారు మద్యం ప్రియులు.

ఎండ దెబ్బకు పెరిగిన బీర్ సేల్స్..
మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఎవరికి వాళ్లు శీతల పానియాలు, మాల్ట్‌ పానియాల సేవిస్తుంటే ..మద్యం ప్రియులు మాత్రం..బీర్‌కే మా ఓటు అన్నట్లుగా ఎత్తిన బాటిల్ దించకుండా తాగేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే కరోనాతో గండిపడ్డ ఎక్సైజ్‌శాఖ ఆదాయానికి తెలంగాణలోని మద్యం ప్రియులు ఒక్క ఏడాదిలోనే ఆ నష్టాన్ని భర్తీ చేశారు. రాష్ట్ర ఖజానాకు బీర్‌ పొంగించినట్లుగా ఆదాయాన్ని పెంచారు.

రికార్డ్‌ స్థాయిలో గుటకేసిన మద్యం ప్రియులు..
దేశం వ్యాప్తంగా చూసుకుంటే కూడా తెలంగాణలో అత్యధికంగా మద్యం అమ్మకాలు జరుగుతాయి. ప్రతి ఏటా బీర్‌ సేల్స్‌ బాగానే ఉంటుంది. కరోనాకు ముందు ఇలాంటి రికార్డులే ఉన్నాయి. ఒక్క బీరే కాదు బ్రాందీ, విస్కీతో పాటు ప్రతి లిక్కర్ సేల్స్‌ కూడా ఈఏడాదిలో బాగానే పెరిగాయి. వేసవి తాపానికి గొంతు తడుపుకోవడానికి యువత, మద్యం ప్రియులు బీర్‌కు ప్రయారిటీ ఇస్తుంటే డాక్టర్లు మాత్రం ..అత్యధికంగా శీతల పానియాలు, బీర్లు తాగడం కూడా ఒకరకంగా ఇబ్బందికరమేనని సూచిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Beer, Liquor sales, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు