హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య.. మరి డబ్బు కట్టిన వారి పరిస్థితేంటి?

Hyderabad: రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య.. మరి డబ్బు కట్టిన వారి పరిస్థితేంటి?

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య

Hyderabad: ఇప్పుడు మూసా సిద్దిఖీ మరణించడంతో.. తమ పరిస్థితి ఏంటని బాధితులు వాపోతున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టి.. అప్పులు చేసి.. డబ్బులు కట్టామని.. తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌లో దారుణ హత్య జరిగింది. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 20 లక్షల రూపాయల విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మూసా సిద్దిఖీతో ఫయాజ్ అనే వ్యక్తి గొడవపడ్డారు. కొంత కాలంగా వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న వీరిద్దరు ఓ చోట భేటీ అయ్యారు. తనకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఫయాజ్ నిలదీశాడు.

 Love and murder : ప్రేమకథలో హత్య .. మధ్యలో ట్విస్ట్స్ .. మామూలుగా లేదుగా!

దీనిపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటచేసుకుంది. మాటా మాటా పెరగడంతో.. సిద్దిఖిపై ఫయాజ్ కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత రాడ్డుతో కొట్టి పారిపోయాడు. కొందరు స్థానికులు ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మూసా సిద్దిఖీ పాతబస్తీలో నివసిస్తాడు. కేఎంఆర్ ఇండియా హోమ్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కేఎంఆర్ ఇండియా హోమ్స్‌లో ఫ్లాట్ల కొనుగోలుకు ఇప్పటికే చాలా మంది నగరవాసులు ఆయనకు పెద్ద మొత్తంలో డబ్బు కట్టినట్లు సమాచారం. ఆ డబ్బులకు రశీదులను కూడా తీసుకోలేదట.

ఇప్పుడు మూసా సిద్దిఖీ మరణించడంతో.. తమ పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టి.. అప్పులు చేసి.. డబ్బులు కట్టామని.. తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కేఎంఆర్ ఇండియా హోమ్స్‌లో తమకు ఫ్లాట్స్ వస్తాయా? కనీసం ఇచ్చిన డబ్బులైనా వెనక్కి ఇస్తారా? అని లేదా ఆందోళన చెందుతున్నారు.

First published:

Tags: Hyderabad, Local News, Telangana

ఉత్తమ కథలు