హోమ్ /వార్తలు /తెలంగాణ /

Shocking News: మెక్‌ డొనాల్డ్‌లో బర్గర్ తిందామని వెళ్తే 8ఏళ్ల బాలుడిపై ఎలుక దాడి ..వీడియో ఇదిగో..

Shocking News: మెక్‌ డొనాల్డ్‌లో బర్గర్ తిందామని వెళ్తే 8ఏళ్ల బాలుడిపై ఎలుక దాడి ..వీడియో ఇదిగో..

rat biting

rat biting

Shocking News:మెక్‌డొనాల్డ్ ఔట్‌లెట్‌లో బర్గర్ తిందామని వెళ్తే ..ఓ ఆర్మీ ఉద్యోగికి చేదుఅనుభవం ఎదురైంది. ఆర్డర్ ఇచ్చి బర్గర్ టేబుల్‌ మీదకు వచ్చే సరికే తన 8ఏళ్ల కుమారుడ్ని ఎలుక కరిచింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌(Hyderabad)లోని ఓ రెస్టారెంట్‌లో ఎలుక (Rat)ఎనిమిదేళ్ల బాలుడిని కొరికి గాయపరిచింది. ఈదారుణం కొంపల్లిలోని ఎస్పీజీ హోటల్‌ని గ్రౌండ్ ఫ్లోర్‌లోని చిన్న మెక్ డొనాల్డ్(McDonald's) అవుట్‌ లెట్‌లో మార్చి (March)8న చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ(CCTV footage)లో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social media)లో వైరల్‌గా మారింది. అయితే ఎలుక దాడిలో గాయపడిన బాలుడు ఎవరో కాదు. ఒక ఆర్మీ ఉద్యోగి(Army employee) కుమారుడు కావడంతో పోలీసులు కేసు నమోద చేసి రెస్టారెంట్‌ యాజమానిపై చర్యలకు సిద్దమయ్యారు.

మెక్‌డొనాల్డ్‌లో బాలుడిపై ఎలుక దాడి..

ఫ్యామిలీతో సరదాగా గడుపుదామని రెస్టారెంట్‏కు వెళ్లిన ఓ ఆర్మీ ఆఫీసర్‏కు చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి తింటుండగా.. ఓ ఎలుక వచ్చి 8 ఏళ్ల బాలుడిని కొరికింది. ఏదో తన ఆహారమంతా దోచుకొని తింటున్నట్లు చిన్నారిని కసిగా కొరికేసింది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటన జరిగినప్పుడు 8 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో ఉన్నాడు. ఎలుక బాలుడి షార్ట్‌ పైకి ఎక్కడంతో, అతడి తండ్రి అతణ్ని రక్షించడానికి ముందుకు దూకి, పిల్లవాడి షార్ట్‌ లో నుంచి ఎలుకను తీసి దూరంగా విసిరేశారు. బాలుడు గట్టిగా అరవడంతో ఆందోళనకు గురైన తండ్రి వెంటనే ఎలుకను తీసి పక్కకు పాడేసి కుమారుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడికి ఎడమకాలుపై రెండు చోట్ల కుట్లు పడినట్లు డాక్టర్లు తెలిపారు. హైదరాబాద్ కొంపల్లిలోని ఓ రెస్టారెంట్‏లో ఈ ఘటన జరిగింది. ఇంత జరుగుతున్నా రెస్టారెంట్ యాజమాన్యం తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో సీరియస్ అయిన ఆర్మీ ఆఫీసర్ సదరు రెస్టారెంట్‏పై పోలీస్ స్టేషన్‏లో కేసు నమోదు చేశారు.

ఆర్మీ ఉద్యోగికి ఊహించని షాక్ ..

రెస్టారెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడికి ఈ పరిస్థితి వచ్చిందని సదరు ఆఫీసర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏకంగా వాష్ రూమ్ నుంచి బయటికి వచ్చిన ఎలుక తన కుమారుడి షార్ట్ లోకి దూరి తొడ పై భాగంలో గట్టిగా కొరికిందని, ఎలుక పంటి గాట్లు పెట్టిన ఫోటోలను ఫిర్యాదుతో పాటు జతచేశారు. పరిశుభ్రత పాటించని రెస్టారెంట్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్మీ ఆఫీసర్ డిమాండ్ చేశారు. ప్రాథమిక చికిత్స నిమిత్తం 8 ఏళ్ల బాబుకు యాంటీ రేబిస్, టీకాలకు ఇప్పించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. సదరు రెస్టారెంట్ పై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.

Hyderabad: కార్ ట్రావెల్స్‌ పేరుతో టోకరా .. 14 కార్లు మాయం చేసిన మహా మోసగాడు

యాజమాన్యం నిర్లక్ష్యంపై చర్యలు..

ఈ ఘటన మార్చి 8న చోటు చేసుకుంది. మరుసటి రోజు బాలుడి తండ్రి రెస్టారెంట్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తన కుమారుడిని ఎలుక కొరికిన తర్వాత కూడా రెస్టారెంట్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. చట్టపరంగా శిక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆర్మీ ఆఫీసర్.

First published:

Tags: Hyderabad crime, Viral Video

ఉత్తమ కథలు