Naveen Murder Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన లవర్ తో చనువుగా ఉంటున్నాడని అనుమానంతో హరిహర అనే వ్యక్తి అతని స్నేహితుడైన నవీన్ ను పిలిపించుకొని మరి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆపై తన లవర్ నిహారికకు, ఫ్రెండ్ హసన్ ను హరిహర ఈ విషయాన్ని చెప్పాడు. ఇక ఈ కేసులో ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న నిహారికకు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనితో నిహారిక జైలు నుంచి బయటకు రానుంది.
కాగా ఈ కేసులో హరిహర ప్రధాన నిందితుడు కాగా..అతని ప్రియురాలిని ఏ2గా, హరిహర స్నేహితుడు హసన్ ను ఏ3గా చేర్చారు. నవీన్ ను హత్య చేసిన ఘటనా స్థలానికి తన ప్రియురాలు, మిత్రుడు హాసన్ ను హరిహర తీసుకెళ్లాడు. హరిహర కృష్ణతో కలిసి ఈ ఇద్దరు నవీన్ మృతదేహాన్ని చూశారు. అంతేకాదు హరిహర ప్రియురాలు నుండి హరిహరకు రూ.1500 కూడా పంపించినట్లు పోలీసులు గుర్తించారు. దీనితో నిందితులుగా చేర్చిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ హత్యలో మొదటి నుండి హరిహర ప్రియురాలి ప్రమేయం లేదని అనుకోగా తాజాగా బయటపడ్డ విషయాలతో ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇటీవల విచారణ సమయంలో ఆమె తీరుపై పోలీసులకు అనుమానం కలిగింది. అయితే మొదట ఇందులో హరిహర ప్రియురాలి ప్రమేయం లేదని చెప్పుకు రాగా..తాజాగా ఆమె పేరును నిందితుల జాబితాలో చేర్చిన పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక ఈ కేసులో కీలకంగా భావించిన హరిహర గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు అసలు సహకరించ లేదని తెలుస్తుంది. ఆమె నుండి సమాచారం రాబట్టడం పోలీసులకు బిగ్ టాస్క్ గా మారింది. అయితే సంచలనంగా మారిన ఈ కేసును ఆమె లైట్ తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే 3 సార్లు కూడా హరిహర గర్ల్ ఫ్రెండ్ ను పోలీసులు విచారించగా ఆమె నోరు మెదపలేదు. దీనితో ఆమెకు సఖి కేంద్రంలో కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. అయినా కూడా ఆమె తీరు మారకపోగా..తనను ఈ కేసులోకి లాగితే ఆత్మహత్య కూడా చేసుకుంటానని ఏకంగా పోలీసులనే బెదిరించినట్లు తెలుస్తుంది.
కాగా ఎక్కువగా క్రైమ్ సిరీస్ లు చూసే హరిహర ఇలా ఒళ్లు గగుర్పొడిచేలా హత్య చేసినట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.