హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. రంజాన్ సందర్భంగా మరో నుమాయిష్ ఎక్కడంటే ?

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. రంజాన్ సందర్భంగా మరో నుమాయిష్ ఎక్కడంటే ?

మినీ నుమాయిష్

మినీ నుమాయిష్

మీకు నోరూరించే స్ట్రీట్ ఫుడ్స్‌తో పాటు.. సాంప్రదాయ వంటకాలు , మీ రుచికి తగ్టట్టు... వివిధ డెజర్ట్‌లను కూడా మీరు ఇక్కడ టేస్ట్ చేయవచ్చు. స్పైసీ కబాబ్‌ల నుంచి స్వీట్ జిలేబీస్ వరకు, మీరు తినాలనుకునే అనేక రకాల ఫుడ్స్ ఇక్కడ మీకు అందుబాటులో ఏర్పాటు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్.. భాగ్యనగరం... ముత్యాల నగరం, దాని గొప్ప సంస్కృతి, వారసత్వం, నగరంలో నోరూరించే వంటకాలకు ప్రసిద్ధి చెందింది. రంజాన్ మాసంలో నగరంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమాలలో ఒకటి నుమాయిష్, చార్మినార్ వీధుల్లో ఒక కార్నివాల్ లాంటి పండుగ వాతావరణం నెలకొంది. ఓ శతాబ్దం నుండి ఆహారం, షాపింగ్, ఆటలు, వినోదాన్ని ఒకే పైకప్పు క్రిందకు తీసుకువస్తుంది. ప్రతీ ఏడాది వచ్చే నుమాయిష్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సారి రంజాన్ సందర్భంగా నగరంలో మినీ నుమాయిష్ ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌లోని టోలి చౌకిలోని మెజెస్టిక్ గార్డెన్‌లో జరిగే గోల్డ్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన మిస్టర్ జావేద్ మహ్మద్ మరియు మిస్టర్ సల్మాన్‌లచే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది మీ అన్ని అవసరాల కోసం ఒక స్టాప్-షాప్, ఇక్కడ మీరు ఆహారం, షాపింగ్, ఆటలు వినోదాలలో మునిగిపోవచ్చు. ఈవెంట్ ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 21, 2023 వరకు నిర్వహించబడుతుంది.

రంజాన్ మినీ నుమాయిష్‌లో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ రకాల రుచికరమైన ఆహారాలు, అలాగే అంతర్జాతీయ వంటకాలు కూడా ఉండనున్నాయి. మీకు నోరూరించే స్ట్రీట్ ఫుడ్స్‌తో పాటు.. సాంప్రదాయ వంటకాలు , మీ రుచికి తగ్టట్టు... వివిధ డెజర్ట్‌లను కూడా మీరు ఇక్కడ టేస్ట్ చేయవచ్చు. స్పైసీ కబాబ్‌ల నుంచి స్వీట్ జిలేబీస్ వరకు, మీరు తినాలనుకునే అనేక రకాల ఫుడ్స్ ఇక్కడ మీకు అందుబాటులో ఏర్పాటు చేస్తున్నారు. ఫుడ్, షాపింగ్‌లతో పాటు.. అన్ని వయస్సుల వారికి రకరకాల గేమ్స్ ఈవెంట్ కూడా ఈ నుమాయిష్‌లో నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. కార్నివాల్ గేమ్‌లలో మీ అదృష్టాన్ని కూడా ఇక్కడ ప్రయత్నించవచ్చు, ఫెర్రిస్ వీల్‌లో ప్రయాణించవచ్చు .

ఇక ఈ మినీ నుమాయిష్‌లో స్థానిక కళాకారులచే ప్రత్యక్ష సంగీతం , సాంస్కృతిక ప్రదర్శనలను కూడా నిర్వహిస్తుంది. సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఈ ఈవెంట్ ఒక సంపూర్ణ కుటుంబ విహారయాత్ర , పవిత్రమైన రంజాన్ ఉపవాస మాసంలో మీ ప్రియమైనవారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి గొప్ప అవకాశం. ఇక్కడకు వచ్చే సందర్శకులకు అవాంతరాలు లేని ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగి ఉండేలా ఈ ఈవెంట్ అత్యంత జాగ్రత్తతో, భద్రతా చర్యలను దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్నారు. COVID-19 వ్యాప్తిని అరికట్టేలా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు. వ్యాపారులు విక్రేతలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తారని నిర్వాహకులు తెలిపారు.

First published:

Tags: Hyderabad, Local News

ఉత్తమ కథలు