హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ramzan: రంజాన్ మాసం ప్రారంభం.. మక్కా మసీదులో ప్రత్యేక ఏర్పాట్లు

Ramzan: రంజాన్ మాసం ప్రారంభం.. మక్కా మసీదులో ప్రత్యేక ఏర్పాట్లు

X
మక్కా

మక్కా మసీదు

రంజాన్‌ సందర్భంగా చారిత్రక మక్కా మసీదు, షాహీ మసీదుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మక్కామసీదు అంతర్భాగంలో కొత్త కార్పెట్‌ వేసి, ప్రాంగణంలోని షెడ్డును సిద్ధం చేసే పనులు పూర్తయ్యాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రిపోర్టర్: దస్తగిర్ అహ్మద్

లొకేషన్: హైదరాబాద్

పవిత్ర రంజాన్ మాసం (Ramzan) నేటి నుంచి ప్రారంభమవడంతో.. భాగ్యనగరంలో మసీదులన్నీ ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. రంజాన్‌ సందర్భంగా చారిత్రక మక్కా మసీదు, షాహీ మసీదుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మక్కామసీదు అంతర్భాగంలో కొత్త కార్పెట్‌ వేసి, ప్రాంగణంలోని షెడ్డును సిద్ధం చేసే పనులు పూర్తయ్యాయి.మైనార్టీ వెల్ఫేర్ డైరెక్టర్ బి.షఫీవుల్లా ప్రత్యేక ఆసక్తితో రంజాన్ రాకముందే అన్ని నిర్మాణాలు, మరమ్మతు పనులు పూర్తి చేశారు. ఇంటీరియర్‌లోని మొత్తం 16 గోపురాలలో పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి.  ఇఫ్తార్, తరావీహ్ సమయంలో లోపలి భాగంలోని మొత్తం స్థలం ప్రార్థనల కోసం ఉపయోగిస్తారు.

2008లో అప్పటి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఇంటీరియర్‌లో కార్పెట్‌ ఏర్పాటు చేయగా, ఆ తర్వాత తొలిసారిగా కొత్త కార్పెట్‌ వేశారు. మక్కా మసీదులో అవసరమైన అన్ని పనులు పూర్తి చేయడానికి సుమారు రూ. 8 కోట్లు ఖర్చు చేశారు. కొత్త కార్పెట్ నిర్వహణ కోసం కొత్త యంత్రాలను కొనుగోలు చేసినట్లు బి షఫీవుల్లా తెలిపారు. అత్యంత అందమైన డిజైన్ కార్పెట్ మసీదు అందాన్ని మరింత పెంచుతోంది. వర్షం, ఎండలు వచ్చినప్పుడు భక్తులకు రక్షణగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రాంగణంలో షెడ్డును సిద్ధం చేస్తారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లను కూడా ఏర్పాటు చేశారు.

అభ్యంగన గదులు, మరుగుదొడ్లు శుభ్రం చేసే పనులు కూడా చేపట్టారు. మసీదు ట్యాంక్‌ను శుభ్రం చేయడంతో పాటు అందమైన ఫౌంటెన్‌ను ఏర్పాటు చేశారు.  మసీదు చుట్టూ  సీసీ కెమెరాల సంఖ్యను 43 నుంచి 75కు పెంచామని మైనార్టీ సంక్షేమశాఖ అధికారులను షఫీవుల్లా  తెలిపారు. రంజాన్ సందర్భంగా ఎప్పటికప్పుడు మసీదును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

First published:

Tags: Hyderabad, Local News, Telangana

ఉత్తమ కథలు