సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాద (Secunderabad Fire Accident) ఘటనలో ముగ్గురు సజీవమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. వారంతా బీహార్‌కు చెందిన వలస కూలీలుగా తేలింది. మినిస్టర్ రోడ్డులోని ఆరంతస్తుల భవనంలో దాదాపు 12 గంటల పాటు మంటలు చెలరేగాయి. మొదట కింది అంతస్తులో మంటలు చెలరేగి.. ఆ తర్వాత బిల్డింగ్ మొత్తానికీ వ్యాపించాయి. దట్టమైన పొగలు, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్ని కీలకలను చూసి.. స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. ముందుజాగ్రత్తగా అధికారులు వారందరినీ ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 12 గంటల పాటు శ్రమించి.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఐనప్పటికీ.. ఇవాళ ఉదయం వరకు కూడా కింది ఫ్లోర్‌లో మంటలు కనిపించాయి. భవనంలో విపరీతమైన వేడి ఉంది. సుదీర్ఘ సమయం పాటు కాలిపోవడంతో.. ఆ భవనం పూర్తిగా దెబ్బతింది. ఏ క్షణమైనా కూలిపోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఊరిని రెండుగా చీల్చిన గ్రామ కమిటీ పోస్ట్ .. 20రోజులుగా అక్కడ ఎవరికివారే యమునా తీరే
గురువారం మంటలు ప్రారంభమైన సమయంలో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి... పలువురిని ప్రాణాలతో కాపాడారు. ఆ తర్వాత పూర్తిగా మంటలను ఆర్పడంపైనే దృష్టిపెట్టారు. పెద్ద ఎత్తున నీటిని చల్లినా.. ఫోమ్‌తో ఆర్పే ప్రయత్నం చేసినా.. మంటలు అదుపులోకి రాలేదు. అదే సమయంలో గాలులు వీడయంతో.. మరింత భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. భవనం మొత్తం కాలిపోయింది. అందులో ఉన్న ప్రతి వస్తువూ బూడిదయింది. పూర్తిగా శిథిలావస్థలకు చేరుకోవడంతో అందులోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు.
మరోవైపు ఆ భవనంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారిని బీహార్‌కు చెందిన కూలీలు జునైద్, వసీమ్, అక్తర్‌గా గుర్తించారు. ప్రమాద సమయంలో వారంతా లోపలే ఉన్నట్లు బంధువులు చెప్పారు. మంటలు ప్రారంభమైన సమయంలో వారికి ఫోన్ కలిసిందని.. ఆ తర్వాత కాసేపటికి స్విచాఫ్ అయ్యాయని తెలిపారు. వారి సెల్ ఫోన్ లోకేషన్ కూడా మంటలు చెలరేగిన భవనంలోనే చూపిస్తోంది. ఈ నేపథ్యంలో వారంతా బయటకు వచ్చే అవకాశమే లేదని.. మంటల్లో కాలిపోయి మరణించవచ్చని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 12 గంటల పాటు భవనం తగలబడడంతో.. వారంతా కాలి బూడిద కావచ్చని అనుమానిస్తున్నారు. దంతాలు తప్ప. . ఏమీ దొరికే అవకాశం లేదంటున్నారు. కూలీలకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించాలని భావిస్తున్నారు. కానీ ఉన్నతాధికారుల నుంచి క్లియరెన్స్ వస్తేనే... భవనం లోపలికి వెళ్తామని అధికారులు పేర్కొన్నారు.
అటు ఆ భవనం పక్కన ఉన్న బస్తీ వాసుల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడి ప్రజలందరినీ అక్కడి నుంచీ తరలించారు. భవనం కూలిపోయే అవకాశం ఉండడంతో.. అది చుట్టుపక్కల ఇళ్లపైనా పడవచ్చు. అందువల్ల పక్కన ఉన్న ఇళ్లు కూడా ధ్వంసం కావచ్చు. ఈ నేపథ్యంలో కట్టుబట్టలతో బయటకు వెళ్లిపోయిన కొందరు బస్తీవాసులు.. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టి.. ఇళ్లను కట్టుకున్నామని.. ఇప్పుడు తమకు దిక్కెవరని విలపిస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Hyderabad, Local News, Secunderabad