టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. అతని భార్య ఉపాసన ఇటీవలే గర్భవతి అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపారు. ఇక అప్పటినుండి ఉపాసన అన్ని శుభవార్తలు వింటూ సంతోషంగా గడుపుతుంది. భర్తతో కలిసి విదేశాలకు వెళ్లి విహార యాత్రలు చేస్తూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఉపాసన పుట్టింట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె గ్రాండ్ మదర్ పుష్నాని తుదిశ్వాస విడిచింది.
ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ''కడవరకు కృతజ్ఞత, ప్రేమ, గౌరవం, సానుభూతితో తన జీవితాన్ని కొనసాగించింది. ఆమె జీవితం నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. పుష్నాని నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె పంచిన ప్రేమను నేను ఎన్నటికీ మరువలేను. నేను నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఎలాంటి ప్రేమానురాగాలను పొందానో.. ఆ అనుభూతులన్నింటినీ నా పిల్లలకు అందేలా చూస్తానని ప్రమాణం చేస్తున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి'' అంటూ ఎమోషనల్ అయ్యింది.
ఉపాసన పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. రెస్ట్ ఇన్ పీస్ అంటూ.. కామెంట్లు పెడుతున్నారు.పలువురు సెలబ్రిటీలు కూడా ఉపాసనకు తమ సంతాపం తెలిపారు. నువ్వు అద్భుతమైన తల్లివి అవుతావంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. మరోవైపు రామ్ చరణ్ అభిమానులు కూడా ఉపాసనకు తమ సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Ram Charan, Upasana konidela