హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: అమ్మకానికి పోచారం, గాజుల రామారం రాజీవ్ స్వగృహ టవర్స్

Hyderabad: అమ్మకానికి పోచారం, గాజుల రామారం రాజీవ్ స్వగృహ టవర్స్

rajeev swagruha towers

rajeev swagruha towers

Hyderabad: ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కింద నిర్మించిన టవర్లను విక్రయించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్ షిప్ ల పరిధిలో పూర్తిగా నిర్మాణం కాని రాజీవ్ స్వగృహ టవర్లు ఎక్కడ ఎలా ఉన్నవి అలా విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జంటనగరాల పరిధిలో నివసించే ప్రజలకు ఓ శుభవార్త. బిల్డర్లు (Builders),డెవలపర్లు(Developers),అసోసియేషన్లు (Associations),వ్యక్తులు వారికి ప్రభుత్వం ఓ సదావకాశాన్ని అందిస్తోంది. ప్రభుత్వం రాజీవ్ స్వగృహ (Rajeev swagruha)కింద నిర్మించిన టవర్ (Towersను విక్రయించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే మేడ్చల్ మల్కాజిగిరి (Medchal Malkazigiri)జిల్లాలోని పోచారం(Pocharam),గాజుల రామారం(Gajula ramaram)టౌన్ షిప్ ల పరిధిలో పూర్తిగా నిర్మాణం కాని రాజీవ్ స్వగృహ టవర్లు ఎక్కడ ఎలా ఉన్నవి అలా విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని విక్రయించే బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (HMDA) కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. వీటికి సంబంధించి ఇప్పటికే హెచ్ఎండిఏ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Tribal tradition: విశ్వశాంతి కోసం ఆ ఆదివాసి గిరిజన మహిళ ఏం చేసిందో తెలుసా.. ?

బిగ్ సేల్..బిగ్ డీల్ ..

ఇందులో భాగంగానే సోమవారం 9వ తేదీన హెచ్ఎండిఏ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఫ్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు హిమాయత్ నగర్, ఉర్దూగల్లీలో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కార్యాలయం మీటింగ్ హాల్లో ఈ ఫ్రీ బిడ్ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. పోచారంలో 9 అంతస్తుల నాలుగు(4) టవర్లు ఉండగా, వాటిల్లో ఒక్కొక్క టవర్‌లో కనీసం 72 నుంచి 198 ప్లాట్‌లను నిర్మించుకునే సదుపాయం ఉంది.

రెండు చోట్ల టవర్లు అమ్మకం..

అదేవిధంగా గాజుల రామారంలో 14 అంతస్తుల ఐదు(5) టవర్లు ఉండగా వాటిల్లో ఒక్కొక్క టవర్‌లో 112 ప్లాట్ లను నిర్మించుకునే సదుపాయం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు సమీపంలో ఉన్న పోచారం, గాజులరామారం స్వగృహ టవర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తిగల బిల్డర్లు, డెవలపర్లు, సొసైటీలు, వ్యక్తులు జనవరి 30వ నాటికి రూ.10 లక్షలు ధరావత్తును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ధరా వత్తు చెల్లించిన దరఖాస్తుదారుల ఎంపిక పారదర్శకంగా లాటరీ విధానం ద్వారా టవర్లను కేటాయిస్తారు. ఆసక్తిగల వ్యక్తులు, సంస్థలు, బిల్డర్లు, డెవలపర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు సోమవారం జరిగే ప్రి బిడ్ సమావేశానికి హాజరై ఇతర వివరాలను అడిగి తెలుసుకోవచ్చునని తెలిపారు.

First published:

Tags: Hyderabad, Telangana News