నుపూర్ శర్మకు (nupur sharma) మద్దతుగా పోస్ట్ లు పెట్టినందుకు, ఉదయ్ పూర్ (Udaipur) లో టైలర్ కన్హయ్య లాల్ ను రియాజ్ అఖ్తీ, గోస్ మహ్మద్ అనే ఇద్దరు ముస్లిం యువకులు అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. ఇక ఘటనపై కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఎన్ఐఏ (NIA) తన విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో హైదారబాద్ లోని పాతబస్తీకి చెందిన ఒక వ్యక్తి, ఈ హత్య ఘటనతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
దీంతో హైదరాబాద్ లోని పాతబస్తీలో (Old city) ఉన్న సదరు వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోనికి తీసుకున్నట్లు సమాచారం. దీంతో మరోసారి భాగ్య నగరం ఉలిక్కిపడింది. ఇప్పటికే అనేక మంది నాయకులు, పాతబస్తీ లో అనేక మంది సంఘ వ్యతిరేక కార్యకలాపాలుచేసేవారికి అడ్డగా మారిందని, అనేక మంది రాజకీయ నాయకులు తరచుగా వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ క్రమంలో.. ఇప్పుడు టైలర్ హత్య కేసులో, ఎన్ఐఏ ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకొవడంతో పాతబస్తీ మరోసారి వార్తలలో నిలిచింది.
ఇదిలా ఉండగా నుపూర్ శర్మ (nupur sharma) వ్యాఖ్యలను సోషల్ మీడియా (Social media) వేదికగా సపోర్ట్ చేసిన కారణంగా.. రియాజ్ అఖ్తీ, గోస్ మహ్మద్ అనే ముస్లింయువకులు.. టైలర్ ను అతి దుకాణంలో ప్రవేశించి అతిదారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో (Uday pur) శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడింది. వెంటనే రంగంలోనికి కేంద్ర దర్యాప్తు సంస్థలు దిగాయి.
24 గంటలు గడవక ముందే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అదుపులోనికి తీసుకుని జైలుకు తరలించారు. అయితే, రియాజ్ అఖ్తరీ, గోస్ మహ్మద్ లను విచారణలో భాగంగా జైపూర్ లోని కోర్టుకు తరలించారు.
కోర్టులో విచారణ సందర్భంగా కోర్టు వెలుపల ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు విచారణ అనంతరంల నిందితులు బైటకు వచ్చేటప్పుడు అక్కడే ఉన్న ప్రజలు, లాయర్లు.. వీరిపై దాడులకు తెగబడ్డారు. ఒకనోక సందర్భంలో.. నిందితుల్లో ఇద్దరిని పట్టుకుని పక్కకు లాగి దాడికి యత్నించారు. దీంతో పోలీసులు అతి కష్టం మీద వీరిని భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో జైలుకు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Hyderabad, Murder, NIA, Old city, Rajasthan, Telangana crime