నేడు, రేపు వర్షాలు పడే అవకాశం.. జాగ్రత్తగా ఉండాలంటున్న..

Hyderabad Rains : హైదరాబాద్‌లో నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

news18-telugu
Updated: April 6, 2020, 8:41 AM IST
నేడు, రేపు వర్షాలు పడే అవకాశం.. జాగ్రత్తగా ఉండాలంటున్న..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Hyderabad Rains : హైదరాబాద్‌లో నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. గత రెండు రోజులుగా వాతావరణం చల్లగా, సాధారణ ఉష్ణోగ్రతతో పోల్చితే 6 డిగ్రీలు తక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గోల్కొండ, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారిందని వివరించారు. తెలంగాణలోనూ పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. దక్షిణ కేరళ మీదుగా వీస్తున్న ఉపరితల ద్రోణి ప్రభావం వల్లేనని స్పష్టం చేశారు.

అటు.. వాతావరణం చల్లబడుతున్నందున కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా అయ్యే అవకాశాలున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. రోగ నిరోధక శక్తి తగ్గిపోకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి, మందులు వాడాలంటున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 6, 2020, 8:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading