హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Rains: మెట్రోకు ఎగబడుతున్న జనం.. రైళ్లకు అంతరాయం

Hyderabad Rains: మెట్రోకు ఎగబడుతున్న జనం.. రైళ్లకు అంతరాయం

అంతరాయం పట్ల చింతిస్తున్నామని మెట్రో అధికారులు ప్రకటించారు. వెంటనే మెట్రో సర్వీసులను పునరుద్ధరించామని.. ప్రయాణికుల రద్దీతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపారు.

    భారీ వర్షాలతో హైదరాబాద్‌లో జనజీవనం అస్తవ్యస్తమైంది. రెండు రోజులుగా కుండపోత వర్షాలు పడుతుండడంతో నగర రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. రోడ్లపై వరద నీరు, ట్రాఫిక్‌ జామ్‌లతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. రోడ్లపై వెళ్లే పరిస్థితి లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు నగర వాసులు. ప్రయాణికుల తాకిడి పెరగడంతో కూకట్‌పల్లి సహా పలు స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. జనం రద్దీతో ఎల్‌బీనగర్-అమీర్‌పేట్-మియాపూర్ రూట్‌లో మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. సుమారు 40 నిమిషాల పాటు మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. అంతరాయం పట్ల చింతిస్తున్నామని మెట్రో అధికారులు ప్రకటించారు. వెంటనే మెట్రో సర్వీసులను పునరుద్ధరించామని తెలిపారు. ప్రయాణికుల రద్దీతో ఎక్కడం, దిగడం ఆలస్యమవుతోందని.. అందువల్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని వెల్లడించారు.

    First published:

    Tags: Heavy Rains, Hyderabad, Hyderabad Metro, Hyderabad news, Hyderabad Rains

    ఉత్తమ కథలు