Hyderabad Rains: ట్రాఫిక్‌లో చిక్కుకున్న మంత్రి కేటీఆర్

సాయంత్రం కురిసిన వర్షానికి బంజారహిల్స్‌లో భారీగా ట్రాఫిక్ జామైంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆ ట్రాఫిక్‌లో మంత్రి కేటీఆర్ చిక్కుకుపోయారు. దాంతో చాలా సమయం పాటు ట్రాఫిక్‌లోనే ఉండిపోయారు మంత్రి.

news18-telugu
Updated: September 25, 2019, 8:14 PM IST
Hyderabad Rains: ట్రాఫిక్‌లో చిక్కుకున్న మంత్రి కేటీఆర్
కేటీఆర్(పేస్ బుక్ ఇమేజ్ )
  • Share this:
హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వానలు.. భాగ్యనగారాన్ని అస్తవ్యస్తం చేశాయి. వరద నీటితో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్ కావడంతో నగరవాసులు నరకం చూస్తున్నారు. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి బంజారహిల్స్‌లో భారీగా ట్రాఫిక్ జామైంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆ ట్రాఫిక్‌లో మంత్రి కేటీఆర్ చిక్కుకుపోయారు. దాంతో చాలా సమయం పాటు ట్రాఫిక్‌లోనే ఉండిపోయారు మంత్రి.

భారీ వర్షం నేపథ్యంలో 25 డీఆర్ఎఫ్ దళాలను, 350కిపైగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది జీహెచ్ఎంసీ. రోడ్లపై వరద నీరు క్లియర్ అయ్యే వరకు విధుల్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పర్యటిస్తున్నారు. వరద సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గురువారం కూడా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు డీఆర్ఎఫ్ టీమ్‌లను అప్రమత్తం చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: September 25, 2019, 8:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading