హైదరాబాద్‌పై పగబట్టిన వరుణుడు.. నగరంలో మళ్లీ భారీ వర్షం

రోడ్లతో పాటు ఫ్లైఓవర్లు ఎక్కే, దిగే ప్రాంతాల్లో వర్షం నిలిచిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇటు వర్షం, అటు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.

news18-telugu
Updated: September 30, 2019, 3:05 PM IST
హైదరాబాద్‌పై పగబట్టిన వరుణుడు.. నగరంలో మళ్లీ భారీ వర్షం
Video : హైదరాబాద్‌లో భారీ వర్షం .. లోతట్టు ప్రాంతాలు జలమయం
  • Share this:
హైదరాబాద్‌పై వరుణుడు పగబట్టినట్టే కనిపిస్తోంది. వారం రోజులుగా భారీ వర్షాలతో నగారాన్ని ముంచెత్తుతున్నాడు. ఇప్పటికే చాలా కాలనీలు వరద ముంపులో ఉన్నాయి. తాజాగా సోమవారం మధ్యాహ్నం సైతం హైదరాబాద్‌లో భారీ వాన కురిసింది. సికింద్రాబాద్, చిలకలగూడ, బేగంపేట, సోమాజిగూడ, మెట్టుగూడ, నారాయణగూడ, హిమాయత్‌నగర్, అఫ్జల్ గంజ్, కోఠి, ఖైరతాబాద్‌ సహా చాలా ప్రాంతాల్లో కుండపోత వాన దంచికొట్టింది. భారీ వర్షంతో నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లతో పాటు ఫ్లైఓవర్లు ఎక్కే, దిగే ప్రాంతాల్లో వర్షం నిలిచిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇటు వర్షం, అటు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక ఇప్పటికీ ఆకాశంలో నల్లని కారు మబ్బులు కమ్ముకోవడంతో సాయంత్రం మరోసారి వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అత్యవసరం ఉంటే తప్ప రోడ్ల మీదకు రాకూడదని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
First published: September 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading