HYDERABAD RAINS FOR FOUR DAYS IN TELANAGANA AND MONSOONS ARRIVALS BEFORE SCHEDULE VRY
Rain : ముందే రానున్న నైరుతి..తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు
ప్రతీకాత్మక చిత్రం
Rain : కరోనా విపత్కర వేళ రైతులకు శుభవార్త అందుతోంది. రానున్న వర్షాకాలంలో నైరుతి రుతు పవనాలు సమయానికంటే ముందే రానున్నాయి. దీంతో జూన్ నెల ప్రారంభానికి ముందే వర్షాలు కురవనున్నట్టు వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు.
కరోనా విపత్కర వేళ రైతులకు శుభవార్త అందుతోంది. రానున్న వర్షాకాలంలో నైరుతి రుతు పవనాలు సమయానికంటే ముందే రానున్నాయి. దీంతో జూన్ నెల ప్రారంభానికి ముందే వర్షాలు కురవనున్నట్టు వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు.
గత రెండు మూడు రోజులుగా వాతవరణం చల్లబడుతోంది. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కూడ కురిశాయి. సాధరణంగా నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటి నాటికి కేరళ తీరంలో ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం కాస్త ముందుగానే రానున్నట్టు ఇస్రో వాతవరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నాయని అందుకే ముందస్తు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఆగ్నేయ ఆరేబియా సముద్రంలో శుక్రవారం ఆల్పపీడనం ఎర్పడనుందని, అది బలపడి తుఫాన్ గా మారనుందని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డితో పాటు వరంగల్, ఖమ్మం ,ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతవరణ శాఖ కూడ ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.