Home /News /telangana /

Hyderabad Rains: సినిమా థియేటర్‌ను ముంచెత్తిన వరద నీరు.. ప్రేక్షకులకు భారీ షాక్.. ప్రహరీ గోడ కూలి..

Hyderabad Rains: సినిమా థియేటర్‌ను ముంచెత్తిన వరద నీరు.. ప్రేక్షకులకు భారీ షాక్.. ప్రహరీ గోడ కూలి..

(Image- Twitter)

(Image- Twitter)

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు నిన్న రాత్రి కురిసిన భరీ వర్షానికి (Heavy Rains In Hyderbad) అతలాకుతలమైన సంగతి తెలిసిందే. చాలా ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు నిన్న రాత్రి కురిసిన భరీ వర్షానికి (Heavy Rains In Hyderbad) అతలాకుతలమైన సంగతి తెలిసిందే. చాలా ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీలు పూర్తిగా వరద నీటిలోనే ఉన్నాయి. ముఖ్యంగా దిల్‌సుఖ్ నగర్ ప్రాంతంలోని చాలా కాలనీల్లోకి వరద నీరు చేరడంతో.. ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే సరూర్ నగర్ ప్రాంతంలోని శివ గంగ థియేటర్‌ను వరద నీరు ముంచెత్తింది. భారీ వరద నీరు చేరడంతో ఏషియన్ శివ గంగా థియేటర్ (Asian Shiva Ganga theatre) పూర్తిగా నీటమునిగింది. హాల్‌లోని కుర్చీలపై నుంచి వరద నీరు (Flood water) ప్రవహించింది. థియేటర్‌లో నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    మరోవైపు భారీ వర్షానికి థియేటర్‌ ప్రహరీ కూలింది. దీంతో అక్కడే పార్కు చేసిన దాదాపు 50 బైక్‌లు నుజ్జునుజ్జయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఫస్ట్‌ షో సినిమా సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. వాహనాలు ధ్వంసం కావడంతో.. ప్రేక్షకులు భారీ వర్షంలో ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ బైక్‌లు ధ్వంసం కావడంపై థియేటర్ యజమాన్యం స్పందించడం లేదని ధ్వంసం అయిన బైక్‌ల ఓనర్లు చెబుతున్నారు.

    Hyderabad rains:బయటికి రావొద్దు -ఇవాళ కూడా భారీ వర్షం -ఇవీ తాజా అప్‌డేట్స్

    ఇదిలా ఉంటే జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు శనివారం ఉదయం థియేటర్‌ను పరిశీలించారు. జరిగిన నష్టం గురించి యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. జేసీబీతో గోడ శిథిలాలను తొలగించి వాహనాలను బయటకి తీశారు. ‘నిన్న రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరిందని.. ప్రస్తుతం ఆ నీటిని తొలగించాం’అని అధికారులు తెలిపారు.





    అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు..
    గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న రాత్రి కురిసిన వర్షం నుంచి ప్రజలు తేరుకోకముందే.. మరో పిడుగులాంటి వార్త వారిని కలవరపెడుతోంది. నేటి మధ్యాహ్నం నుంచి నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని (Heavy rain Alert For Hyderabad) వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దన్నారు. ప్రజలు సహాయం కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు 040-21111111కు సంప్రదించాలని అధికారులు సూచించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Heavy Rains, Hyderabad Rains

    తదుపరి వార్తలు