Home /News /telangana /

HYDERABAD RAINFALL WARNING TO TELANGANA FOR UPCOMING THREE DAYS SB

Rain: తెలంగాణ ప్రజలకు చల్లని కబురు .. రానున్న మూడురోజులు వర్షాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు వేడికి అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది,రానున్న మూడురోజులు.. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

  తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడ చూసిన ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. మార్చి నుంచి ఎండ తీవ్రత ప్రారంభమైంది. ఏప్రిల్ నెలలో ఎండలు మండిపోతున్నాయి. జనం బయటకు రాలేని పరిస్థితి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పై గా నమోదు అవుతున్నాయి. దీంతో జనం ఎండలకు అల్లాడుతున్నారు. గత మూడురోజులుగా అయితే ఎండ తీవ్రత పెరిగి ఉక్కుపోత మరింత ఎక్కువైంది. దీంతో ప్రజలకు చల్లటి కబరు చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.

  ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట సహా 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మర్వాడ నుంచి కర్ణాటక మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఇక, హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

  కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి దిశగా ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని గంటకు 06- నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హైదరాబాద్ విభాగం పేర్కొంది.
  నిన్న మరట్వాడ నుండి ఇంటీరియర్ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు పశ్చిమ విదర్భ నుండి మరాత్వడా, కర్ణాటక మీదుగా ఉత్తరఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి సుమారు 0.9 కిమి ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
  Published by:Sultana Shaik
  First published:

  Tags: HYDERABAD RAIN, Rain alert, Telangana rains, Weather report

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు