Hyderabad Rain: పురానాపూల్ వంతెనకు పగుళ్లు.. రాకపోకలకు బ్రేక్.. వాహనాలు దారి మళ్లింపు

కొద్దిరోజులుగా హైదరాబాద్ ను అతలాకుతలం చేస్తున్న వర్షాలు.. భాగ్యనగర జీవనాన్ని స్థంభింపజేస్తున్నాయి. వరదల కారణంగా పురాతన, చారిత్రాత్మక ప్రదేశాలు కూలుతున్నాయి.

news18
Updated: October 19, 2020, 1:10 PM IST
Hyderabad Rain: పురానాపూల్ వంతెనకు పగుళ్లు.. రాకపోకలకు బ్రేక్.. వాహనాలు దారి మళ్లింపు
పురానాపూల్ వంతెన
  • News18
  • Last Updated: October 19, 2020, 1:10 PM IST
  • Share this:
గడిచిన కొద్దిరోజులుగా భాగ్యనగరాన్ని ముంచేస్తున్న వర్షాలు.. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వానల కారణంగా వరదలతో చాలా చోట్ల ఇళ్లు కూలుతున్నాయి. చారిత్రాత్మకంగా శిథిళావస్థకు చేరుకున్న కట్టడాలు నేలమట్టమవుతున్నాయి. ఇటీవలే వర్షాల కారణంగా చారిత్రాత్మక గోల్కోండ కోటలోని గోడ కూలగా.. తాజాగా ఘన చరిత్ర కలిగిన పురానాపూల్ పాత వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. వరద ఉధృతిని తట్టకోలేక వంతెన కింద పగుళ్లు వచ్చినట్టు నిపుణులు చెబుతున్నారు.  కొన్ని రోజులుగా విరామం లేని వర్షాలతో మూసీ నది పోటెత్తుతున్నది. అయితే.. ఈ క్రమంలోనే ఆ నదికి భారీగా వరద వస్తున్నది. దీంతో పూరానాపూల్ వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. వంతెన కింది భాగంలో పగుళ్లు ఏర్పడటంతో ఆ బ్రిడ్జిపై నుంచి రాకపోకలను నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. జియాగూడ, కార్వాన్ నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మర్గంగా అఫ్జల్ గంజ్ వైపునకు మళ్లిస్తున్నారు.

ఇంకా వరద ఉధృతి తగ్గకపోవడం, రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు.. పురానాపూల్ బ్రిడ్జి పై ముందు జాగ్రత్త చర్యగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కాగా, వరదల కారణంగా వంతెన పరిస్థితి ఎలా ఉందో అంచనా వేసేందుకు ప్రభుత్వం టెక్నికల్ టీమ్ ను తీసుకొచ్చింది.




ఆ టీం పురానాపూల్ బ్రిడ్జితో పాటు మరికొన్ని పాత వంతెనలు.. వాటి పరిస్థితిని గురించి నివేదిక ఇవ్వనున్నారు. కాగా ఇప్పటికే వరదల కారణంగా హైదరాబాద్ లో పదుల సంఖ్యలో జనాలు మృతి చెందగా.. వేలాది మంది నిరాశ్రయులైన విషయం విదితమే.

ఫైల్


ఎప్పుడు ఏ ఇల్లు మునుగుతుందోనన్న భయం లోతట్టు ప్రాంత ప్రజలను వెంటాడుతుంటే.. ఇల్లు కూలుతుందేమోనని పాత ఇళ్లులు ఉన్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.
Published by: Srinivas Munigala
First published: October 19, 2020, 12:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading