Hyderabad rains : దంచికొట్టిన వాన -ఇంకా పడుతుందన్న IMD -లండన్ ,ఇస్తాంబుల్ వద్దు.. బతకడానికి అనువైతే చాలు

హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం

Hyderabad rains : విశ్వనగరం హైదరాబాద్ మరోసారి తడిసిముద్దయింది. శనివారం మధ్యాహ్నం నుంచి కుండపోతలా వర్షం కురుస్తుండటంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షం తీవ్రత వీడియోలు షేర్ చేస్తోన్ నెటిజన్లు.. సిటీ దుస్థితిపై సర్కారువారిని నిలదీస్తున్నారు..

  • Share this:
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాబోయే కొద్ది గంటల్లో మరిన్న ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడం కారణంగా శనివారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమైపోయింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాన దంచికొట్టింది..

జంట నగరాల్లోని వారాసిగూడ, రాంనగర్, సికింద్రాబాద్, అమీర్ పేట్, పంజాగుట్ట, బేగంపేట్, బంజారా హిల్స్, మెహిదీపట్నం తదితరల ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురవగా, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట్, ఎల్ బి నగర్, చింతల్ కుంట, వనస్థలిపురంలో భారీ వర్షం కురిసింది. ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లోనూ వాన అలజడి కనిపించింది.



ఆయా ప్రాంతాల్లో వర్షపు నీరు రహదారులపై చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలోని హుస్సేన్ సాగర్ తోపాటు అన్ని చెరువులూ నిండుకుకొని ఉండటం, ప్రధాన జలాశయాల నుంచి నీరు మూసీ నదిలో కలుస్తున్న క్రమంలో నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలంతా అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీ, పోలీస్ విభాగం వారు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.



హైదరాబాద్ లో రోజుల వ్యవధిలోనే కుండపోత వర్షాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగరాన్ని ఇస్తాంబుల్ , లండన్ మాదిరిగా తీర్చి దిద్దుతామన్న పాలకుల మాటల్ని గుర్తుచేస్తూ.. మార్పు సంగతేమోగానీ హైదరాబాద్ నివాసయోగ్యంగా ఉంటే చాలని కామెంట్లు పెడుతున్నారు.
Published by:Madhu Kota
First published: