హోమ్ /వార్తలు /తెలంగాణ /

Weather Update: తెలంగాణకు మరో రెండు రోజుల వానలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!

Weather Update: తెలంగాణకు మరో రెండు రోజుల వానలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!

భారీ వర్షాలు

భారీ వర్షాలు

రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ వాఖ తెలిపింది. అలాగే సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు సైతం పలుచోట్ల అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం చల్లగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం సాయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ వాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అలాగే పలు చోట్ల రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని చెప్పింది. అలాగే సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు సైతం పలుచోట్ల అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 156 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే కరీంనగర్‌, పెద్దపల్లి , మెదక్‌, సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్‌, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో జనం ఇబ్బందులు పడ్డారు.

మొత్తానికి తెలుగు రాష్ట్రాలైనా.. ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలో కూడా మరో 2 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక వర్షాలు.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రుతుపవనాలకు ముందే అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు, ద్రోణుల ప్రభావం ఎక్కువగా కూడా ఉండటంతో తెలంగాణలో వడగండ్ల వర్షం పడుతోంది.

First published:

Tags: Hyderabad, Local News, Telangana Weather, Weather report

ఉత్తమ కథలు