తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన ఇచ్చిన సంగతి తెలిసిందే. మరో రెండురోజుల్లో తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. రానున్న రోజుల్లోతెలంగాణ రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు పడేఅవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది, మార్చి 15, 16, 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగాపలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వెల్లడించారు..ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. పగటి పూట ఎండ, సాయంత్రానికి వర్షాలు పడతాయని వివరించారు అధికారులు.
రాష్ట్రంలోని ఆదిలాబాద్ , నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల , మంచిర్యాల , కామారెడ్డి , రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
16, 17 తేదీల్లో కూడా వర్షాలు కొనసాగనున్నాయి. 17న మాత్రం వర్షాలు మరింత భారీగా ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగానికి కూడా పలు సూచనలు చేశారు. చేతికి వచ్చిన పంటను కాపాడుకోవాలని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పంటలను కాపాడుకోవచ్చని సలహా ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Heavy Rains, Local News, Telangana rains, Telangana Weather