హోమ్ /వార్తలు /తెలంగాణ /

PM Modi Mother: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ మృతిపై రాహుల్‌గాంధీ,చిరంజీవి సంతాపం..ఏమన్నారంటే

PM Modi Mother: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ మృతిపై రాహుల్‌గాంధీ,చిరంజీవి సంతాపం..ఏమన్నారంటే

modi ji(Photo:Instagram)

modi ji(Photo:Instagram)

PM Modi Mother: ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ మరణంపై కాంగ్రెస్ ఎంపీ, ఆపార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీతో పాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సినీ నటుడు చిరంజీవిసైతం సంతాపం తెలిపారు. ప్రధాని కుటుంబానికి తమ ప్రగాఢసానుభూతిని తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi)మాతృమూర్తి హీరాబెన్ (Heeraben)మోదీ మరణంపై కాంగ్రెస్ ఎంపీ, ఆపార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi)సంతాపం వ్యక్తం చేశారు. వృద్ధాప్య సమస్యలతో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచిన ప్రధాని తల్లి హీరాబెన్‌ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari), సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi) సైతం దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లు తెలియజేశారు. ప్రధాని కుటుంబానికి తమ ప్రగాఢసానుభూతిని తెలిపారు. అహ్మదాబాద్‌(Ahmedabad)లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు హీరాబెన్ మోదీ. తల్లి మరణవార్త తెలియగానే మోదీ అహ్మదాబాద్‌ చేరుకొని అంత్యక్రియలు పూర్తి చేశారు. తల్లి పాడె మోసి..చితికి తలకొరవి పెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ.

PM Modi Mother: ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మృతిపై చంద్రబాబు , వైఎస్‌ జగన్ సంతాపం

రాహుల్‌ సంతాపం ..

దేశ ప్రధాని తన మాతృమూర్తిని కోల్పోవడంపై కాంగ్రెస్ నాయకుడు రాహల్‌గాంధీ విచారం వ్యక్తం చేశారు. తల్లి ,కొడుకు మధ్య ప్రేమ శాశ్వతమైనదని వెలకట్టలేనిదని ట్వీట్‌ చేశారు రాహుల్.ఇలాంటి కష్ట సమయంలో తన ప్రేమ, మద్దతు మీకు ఉంటుందని రాహుల్‌గాంధీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

నితిన్‌ గడ్కరీ నివాళులు..

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తల్లి శ్రీమతి హీరాబెన్ మోదీ మృతి పట్ల కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ దిగ్భ్రాంతికి గురయ్యారు. హీరాబెన్‌ మోదీ అసాధారణ జీవితాన్ని గడిపారని... స్వర్గలోకానికి బయలుదేరిన ఆమె దివ్య ఆత్మకు శాంతికలగాలని కోరారు. ఈసందర్భంగా గడ్కరీ తన నివాళులు అర్పించారు.

చిరు సందేశం..

శ్వాసకోశ వ్యాధితో పాటు వృధ్దాప్య సమస్యలతో హీరాబెన్ మోదీ ఇబ్బందులు పడుతున్నారు. క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూనే మృతి చెందారు. ప్రధాని మోదీ మాతృమూర్తి మృతి పట్ల సినీ నటుడు చిరంజీవి తన విచారం వ్యక్తం చేశారు. మాతాజీ హీరాబెన్ జీ మరణవార్త చాలా బాధాకరమని..ఈసందర్భంగా తన నివాళులు అర్పించారు. హీరాబెన్‌ మోదీజీ తన కుటుంబానికి అందించిన విలువలు చాలా కష్టతరమైనవని పేర్కొన్నారు చిరంజీవి.

సంతాపం..

అంతే కాదు కష్టతరమైన జీవితాన్ని గడుపుతూనే దేశానికి నరేంద్ర భాయ్ వంటి నాయకుడు అందించారని ట్వీట్‌లో పేర్కొన్నారు మెగాస్టార్. చిరంజీవితో పాటు ఉత్తర, దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖులు మోదీకి సంతాపం తెలిపారు.

First published:

Tags: Chirajeevi, Heeraben Modi Passes Away, Nitin Gadkari, Rahul Gandhi

ఉత్తమ కథలు