హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : దసరా పండగకు ఊరెళ్తున్నారా .. రాచకొండ పోలీసులు చెప్పినట్లు చేయకపోతే మీకే డేంజర్

Hyderabad : దసరా పండగకు ఊరెళ్తున్నారా .. రాచకొండ పోలీసులు చెప్పినట్లు చేయకపోతే మీకే డేంజర్

(Photo:Twitter)Mahesh Bhagwat

(Photo:Twitter)Mahesh Bhagwat

Police reference: పండగకు ఊరెళ్లే హడావుడిలో మీ ఆస్తులు, నగలు, విలువైన వస్తువుల సంగతి ఏంటీ ..? హైదరాబాద్‌ శివార్లలో ఉండే వాళ్లు ఇళ్లకు తాళం వేస్తే తిరిగి వచ్చే వరకు అలాగే ఉంటుందన్న గ్యారెంటీ లేదని రాచకొండ కమిషనరెట్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకోసం ఏం చేయమంటున్నారంటే..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దసరా Dussehraపండుగకు నగరం ఖాళీ అవుతోంది. వరుస సెలవుల దినాలతో పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో అందరూ స్వగ్రామాలకు వెళ్లేందుకు కొద్దిరోజులకు ముందే పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఇంత వరకు బాగానే కాని ..పండగకు ఊరెళ్లే హడావుడిలో మీ ఆస్తులు, నగలు, విలువైన వస్తువుల సంగతి ఏంటీ ..? హైదరాబాద్‌(Hyderabad) శివార్లలో ఉండే వాళ్లు ఇళ్లకు తాళం వేస్తే తిరిగి వచ్చే వరకు అలాగే ఉంటుందన్న గ్యారెంటీ లేదని రాచకొండ కమిషనరెట్‌ పోలీసులు(Rachakonda Commissionerate Police)హెచ్చరిస్తున్నారు. క్షేమంగా ఊరెళ్లి లాభంగా తిరిగి రావాలంటే మేం చెప్పినట్లుగా చేయాలని ఓ సర్కులర్(Circular)జారీ చేశారు.

TRS MP Santhoshkumar : నేనెక్కడికి వెళ్లలేదు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నా .. తప్పుడు ప్రచారంపై ఎంపీ సంతోష్‌ రియాక్షన్

మీ జాగ్రత్తే మీకు రక్షణ..

తెలంగాణ పోలీసులు నగరంలోని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాలు, దసరా పండుగ నేపధ్యంలో నగరం విడిచి సొంత ఊళ్లు, స్వగ్రామాలకు వెళ్లాలనుకునే వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇళ్లు వదిలి వెళ్లే ముందు విలువైన వస్తువులు, డబ్బు వంటి వాటిని ఇంట్లో ఉంచవద్దని .. వెంట తీసుకెళ్లాలి లేదంటే బ్యాంకు లాకర్లో , లేదంటే నమ్మకస్తులైన వారికి అప్పగించి వెళ్లమని సూచిస్తున్నారు. అలాగే ఇంటి తాళాలను ఎవరికి పడితే వారికి అప్పగించకూడదని సూచిస్తున్నారు. నగరంలో పండుగకు వెళ్లిన వాళ్ల ఇళ్లలో దొంగలు పడే అవకాశం ఎక్కువ ఉన్నందున రాచకొండ కమిషనరెట్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. పోలీసులు మొత్తం 16 రకాల సూచనలతో కూడిన ఓ పోస్ట్‌ని ట్విట్టర్‌తో పాటు నగర పౌరులకు అందుబాటులో ఉండేలా పబ్లిక్ వెబ్‌సైట్‌లో ఉంచారు.

ఊరెళ్లే వాళ్లు తమ ఇంట్లో దొంగలబారిన పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

1. ఊరు, స్వగ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, నగలు నగదును ఇంట్లో పెట్టకుండా బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలి.

2.బీరువా తాళం చెవులు బీరువా పైన కాని బీరువాలోని బట్టల కింద, ఇంట్లో పెట్టకూడదు.

3.వాహనాలను ఇంటి దగ్గరే ఉంచి వాటి తాళాలను వెంట తీసుకెళ్తడం మంచిది.

4.ఇంటి ముందు తలుపులకు సెంటర్‌ లాక్ వేసి బయట గొళ్లెం పెట్టకండి.

5.ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దు. తాళం కనిపించకుండా కర్టైన్స్ వేయాలి.

6.ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచితే మంచిది.

7.బయట గేటుకు లోపల నుంచి తాళం వేయండి.

8.బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో మరియు బయట లైట్‌ వేసి ఉంచండి.

9.పేపర్‌ బాయ్, పాలవాళ్లను రావద్దని చెప్పండి.

10.నమ్మకైన వాచ్‌మెన్‌లను మాత్రమే నియమించుకోండి.

11.మీరు ఊరికి వెళ్లేటప్పుడు మీకు నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వండి.

12.ఊరికి వెళ్లిన తర్వాత కూడా ఇంటి పక్కన వాళ్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటూ ఉండాలి.

13.బయటకు వెళ్లేటప్పుడు , వాకిట్లో ముగ్గులు వేసేటప్పుడు మెడలోని బంగారు ఆభరణాలు, జాగ్రత్త, వీలైతే చీర కొంగుతో కవర్ చేసుకుంటే మంచిది.

14.మీ కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉంది. భద్రత కూడా ఎక్కువగా ఉంటుంది.

15.మీ ఇంటికి సీసీ కెమెకాలు సొంతంగా ఏర్పాటు చేసుకుని డీవీఆర్‌ని రహస్య ప్రదేశాలలో భద్రపరుచుకోవాలి. మొబైల్ యాప్‌ ద్వారా సీసీ కెమెరా దృశ్యాలు ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం ఉంటుంది.

16.మీరు బస్సు లేదా రైలు ప్రయాణ సమయంలో అపరిచత వ్యక్తులు ఇచ్చిన తిను బండారాలు తీసుకోవద్దు. విలువైన వస్తువులు తీసుకెళ్తుంటే అటువంటి బ్యాగును మీ దగ్గరే భద్రంగా పెట్టుకోవాలని మర్చిపోవద్దు.

హెల్ప్‌ లైన్ నెంబర్‌లు..

రాచకొండ పోలీసులు 16సూచనలు చేస్తూ ఇంకో సమాచారం ఇచ్చారు. ఇంట్లో చోరీ జరిగినా లేక ఎవరిపైన అయినా అనుమానం ఉన్నా వెంటనే డయల్ 100కి కాల్‌ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని లేదంటే 9490617111 నెంబర్‌ వాట్సాప్‌కి మెసేజ్‌ పెట్టాలని సూచించారు. ఈ మెసేజ్‌ని అందరికి షేర్ చేయాలని కోరడం జరిగింది.

Published by:Siva Nanduri
First published:

Tags: Dussehra 2022, Rachakonda Police, Telangana crime news

ఉత్తమ కథలు