హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime news : ఓ సైంటిస్ట్ చీకటి దందా గుట్టురట్టు .. ఇంట్లోనే ఆ దుకాణం పెట్టిన కేటుగాడు

Crime news : ఓ సైంటిస్ట్ చీకటి దందా గుట్టురట్టు .. ఇంట్లోనే ఆ దుకాణం పెట్టిన కేటుగాడు

(Drugs maker)

(Drugs maker)

Drug Gang: వాడో సైంటిస్ట్. నెట్ ప్లెక్స్ వెబ్ సిరీస్‌ రేంజ్‌లో ఇంట్లోనే డ్ర‌గ్స్ త‌యారు చేయ‌డం ప్రారంభించాడు. క‌ట్ చేస్తే..! బాగా చదువుకున్న వ్యక్తిగా...మంచి ఉద్యోగం చేస్తూనే తన బుద్ధిని వక్రమార్గంలో మళ్లించాడు. ఏదో చేసేద్దామని ..మరేదో కనిపెడదామని ప్రయత్నించి చివరకు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(M.Balakrishna,News18,Hyderabad)

వాడో సైంటిస్ట్. నెట్ ప్లెక్స్ వెబ్ సిరీస్‌(Netflex web series)రేంజ్‌లో ఇంట్లోనే డ్ర‌గ్స్(Drugs)త‌యారు చేయ‌డం ప్రారంభించాడు. క‌ట్ చేస్తే..! బాగా చదువుకున్న వ్యక్తిగా...మంచి ఉద్యోగం చేస్తూనే తన బుద్ధిని వక్రమార్గంలో మళ్లించాడు. ఏదో చేసేద్దామని ..మరేదో కనిపెడదామని ప్రయత్నించి చివరకు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. అసలు ఆ సైంటిస్ట్ ఎందుకు జైలుపాలయ్యాడో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. సైంటిస్టులు అంటే సమాజానికి ఉపయోగపడేవి...ప్రజలకు మేలు చేసే వాటిని కనుగొనడం, వాటిని తయారు చేస్తుంటారు. కాని ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) గుంటూరు(Guntur)జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈజీ మ‌నీకి అల‌వాడు ప‌డి ప‌క్క‌దారి తొక్క‌ాడు. ఉన్న‌త విద్యను అభ్యసించడంతో ప్ర‌ముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ(Pharmaceutical company)లలో జూనియర్ సైంటిస్ట్‌(Junior scientist)గా పని చేస్తున్నాడు. ఆ అనుభ‌వంతోనే డ్ర‌గ్స్ త‌యారికి ఉప‌యోగించాడు ఈ ప్ర‌బుద్దుడు. హైద‌రాబాద్‌లో చాపకింద నీరులా డ్రగ్స్ సరఫరా అవుతోంది. డ్రగ్స్ మాఫియాపై గట్టి నిఘా పెట్టిన ప్రత్యేక బృందాలు చేస్తున్న తనిఖీలు, దాడుల్లోనే ఈ డ్రగ్స్‌ తయారి సైంటిస్ట్ దొరికిపోయాడు.

Fake Certificates : అమెరికా వెళ్ల‌డం కోసం ఎంత ప‌ని చేశాడో తెలిస్తే షాక్ అవుతారు



ఇంట్లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీ ..

గుంటూరు జిల్లాల‌కు చెందిన‌ లెనిన్ బాబు అనేక ఫార్మాస్యూటికల్ కంపెనీలలో జూనియర్ సైంటిస్ట్‌గా పనిచేశాడు. ఈ అనుభ‌వంతో ఎలాగైన రాత్రికి రాత్రి కోటిశ్వ‌రుడిగా మారిపోవాలని త‌న‌కొచ్చిన విద్యను అడ్డుపెట్టుకొని అక్రమంగా డ్రగ్స్ తయారిపై ఫోకస్ పెట్టాడు. సైకోట్రోపిక్ పదార్థాలను తయారు చేసే విధానం గురించి త‌న‌కు తెలుసు కాబ‌ట్టి ఇంట్లోనే వాటిని ఉప‌యోగించి పెద్ద మొత్తంలో డ్ర‌గ్స్ ను త‌యారు చేయ‌డం ప్రారంభించాడు. లెనిన్ బాబు త‌న స్నేహితుడు శ్రీనివాస్‌ సహాయం తీసుకొని ఇద్దరూ కలిసి గత కొన్ని రోజులుగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు.

సైంటిస్ట్ చీకటి దందా..

తాజాగా సిటీలో డ్ర‌గ్స్ మాఫియా పెరిగిపోవడం, విచ్చలవిడిగా డ్రగ్స్ సప్లై అవుతుండటంతో సిటీ పోలీసులు డ్రగ్స్ దందాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే రాచ‌కొండ పోలీసులు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తోన్న వారిపై దృష్టి పెట్టారు. ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసుకొని ప్ర‌ముఖ కంపెనీల్లో జూనియ‌ర్ సైంటిస్ట్ హోదాలో ఉన్న వ్య‌క్తి ఉప్పల్‌లోని తన ఇంట్లోనే డ్ర‌గ్స్ త‌యారు చేస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసుల సోదాల్లో నివ్వెరపోయే నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. డ్రగ్స్‌ తయారితో పాటు ఇంట్లోనే ఓ యూనిట్‌ పెట్టుకున్నట్లుగా గుర్తించారు. మత్తు పదార్థాలను తయారు చేసి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు.

Rakhi Pournami 2022: వాస్తవానికి ఈ సంవత్సరం రాఖీ పండుగ జరుపుకోవాల్సిన రోజు ఎప్పుడంటే ..?



పెద్ద మొత్తంలో డ్రగ్స్ సీజ్ ..

రాచకొండ పోలీసులు పట్టుకున్న వ్యక్తుల నుంచి 53 గ్రాముల సింథటిక్ డ్రగ్, 3.6 కిలోల నార్కోటిక్ డ్రగ్స్, ఒక ఎల్‌ఎస్‌డీ బ్లాట్, కొకైన్ క్యాప్సూల్‌తో పాటు మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తార్నాకకు చెందిన పులిచెర్ల శ్రీనివాస్‌రెడ్డితో పాటు నార్కెట్‌పల్లికి చెందిన కొత్తపేటకు చెందిన నాంపల్లి లెనిన్‌బాబును అరెస్ట్ చేశారు. వీరిద్దరితో పాటు మరో నిందితుడు చెన్నైకి చెందిన నెపోలియన్ పరారీలో ఉన్నాడు.ఉప్పల్‌లోని అక్షజ్‌ మాలిక్యులర్‌ రీసెర్చ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అనే కంపెనీ త‌న ఇంట్లోనే ఏర్పాటు చేసిన‌ శ్రీనివాస్‌, లెనిన్ బాబు నిషేధిత సైకోట్రోపిక్‌ పదార్థాలను తయారుచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీళ్లు తయారు చేసిన డ్రగ్స్‌ను శ్రీనివాస్‌, చెన్నైకి చెందిన నెపోలియన్‌కు సరఫరా చేయ‌డంతో పాటు సిటీలో కూడా చాలా మందికి స‌ర‌ఫరా చేస్తున్నట్లుగా నిందితులు అంగీకరించారు. అయితే ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న నెపోలియ‌న్ ను ప‌ట్టుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నాలు చేస్తోన్నారు. త్వ‌ర‌లోనే ప‌రారీలో ఉన్న నెపోలియ‌న్ కూడా ప‌ట్టుకుంటామ‌ని అంటున్నారు పోలీసులు.

First published:

Tags: Drug case, Hyderabad crime, Telangana News

ఉత్తమ కథలు