కరోనా : ఫంక్షన్లపై రాచకొండ కమీషనర్ వార్నింగ్..కరోనా కట్టడికి చర్యలు

మీడియాతో మాట్లాడుతున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ (

కరోనా కట్టడికి పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నిన్న ఒక్కరోజే రాచకొండ కమీషనరేట్ పరిధిలో 832 మందిపై కేసులు పెట్టినట్టు తెలిపారు. మాస్క్‌లు ఖచ్చితంగా ధరించాలని ఆయన సూచించారు.

  • Share this:
తెలంగాణ రాష్ట్ర్రంలో కరోనా కట్టడికి పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఓవైపు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే..మరోవైపు నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నేరుగా పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగుతున్నారు. దీంతో నిన్న ఒక్క రోజు రాచకొండ కమీషనరేట్ పరిధిలోనే మాస్క్ ధరించని 832 మందిపై కేసులు నమోదు చేసినట్టు కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ప్రజలు కరోనా భారిపడకుండా మాస్కులు ధరించాలని ఆయన సూచించారు.

మరోవైపు పెళ్ళిళ్లు, ఇతర ఫంక్షన్లకు రెండు వందలకు మించకుండా చూసుకోవాలని ఆయన విజ్ఝప్తి చేశారు. పెద్ద మొత్తంలో ప్రజలు కరోనా భారిన పడుతున్నందున్న పోలీసులు కూడ చర్యలు తీసుకుంటున్నారని, ఇందుకోసం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసుల్లో సైతం కరోనా భారిన పడుతున్నారని తెలిపారు. దీంతో ప్రజలు స్వీయ రక్షణకంటే మించింది మరోటి లేదని ఆయన హితవు పలికారు. ఈ నేపథ్యంలోనే పలు సంస్థల్లో ఉద్యోగులు, బార్లు, రెస్టారెంట్ యాజమానులు సైతం కరోనా నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ఇందుకోసం ఆకస్మిక తనిఖీలు చేపడుతామని తెలిపారు.
Published by:yveerash yveerash
First published: