HYDERABAD PV SINDHU DANCE TO THE BEAST MOVIE SONG BADMINTON STAR VIDEO GOING VIRAL SNR
PV SINDHU: పీవీ సింధు ప్లేయరే కాదు సూపర్ డ్యాన్సర్ కూడా..ఈ వీడియోనే సాక్ష్యం
Photo Credit:Instagram
PV Sindu Dance:ఆమె బ్యాడ్మింటన్ కోర్టులోకి దిగిన సంచలనమే. సరదాగా డ్యాన్స్ చేసిన రికార్డే. ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బీస్ట్ సినిమాలో పాటకు స్టెప్పులు వేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్‌లు వచ్చిపడుతున్నాయి.
బ్యాడ్మింటన్ (Badminton) స్టార్ పీవీ సింధు(PV SINDHU)మరోసారి తన డ్యాన్స్ ఫర్ఫామెన్స్(Performance)నెటిజన్ల హృదయాలను దోచుకుంది. కోర్టులో రాకెట్ పట్టుకొని సింహంలా ప్రత్యర్ధిపై విరుచుకుపడే సింధూ డ్యాన్స్‌లో కూడా తనకున్న టాలెంట్‌ని సోషల్ మీడియా(Social media)ద్వారా అందరితో షేర్ చేసుకుంటోంది. తమిళ స్టార్ హీరో విజయ్(Hero Vijay) యాస్ట్ చేసిన లేటెస్ట్ మూవీ బీస్ట్ (Beast)మూవీలోని విపరీతంగా పాపులర్ అయిన అరబిక్ కుతు పాటకు పీవీ సింధు అదిరిపోయే స్టెప్పులు వేసి నెటిజన్లను ఫిదా చేసింది. తాను లేటెస్ట్గా డ్యాన్స్ చేసిన మూమెంట్స్‌కి సంబంధించిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్(Instagram)హ్యాండిల్లో షేర్ చేసింది పీవీ సింధు. సోషల్ మీడియాలో పీవీ సింధు చేసిన డ్యాన్స్‌కి ఆమె అభిమానులే కాదు స్పోర్ట్స్ సెలబ్రిటీలు కూడా ఫ్లాట్ అవుతున్నారు. డ్యాన్స్ (Dance) వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షన్నర వ్యూస్, లైక్‌లు వచ్చాయంటే ఈ బ్యాడ్మింటెన్ స్టార్ ఏ రేంజ్లో స్టెప్పులు వేసిందో చూడండి.
డ్యాన్సర్ సింధు..
సినిమా స్టార్స్‌తో బాగా పరిచయం ఉన్న పీవీ సింధుకు వాళ్ల కంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నప్పటికి ..డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని ఈజీగా అర్ధమైపోతుంది. గతంలో కచ్చా బాదమ్ సాంగ్‌కి స్టెప్పులు వేస్తే ఫ్యాన్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత తమిళం పాపులర్ సాంగ్ మయకిరియే సాంగ్ డ్యాన్స్ ఇరగదీసింది. అనిరుధ్ రవిచందన్ కంపోజ్ చేసిన సాంగ్‌కి పీవీ సింధు డ్యాన్స్ చేస్తే ఆ వీడియోకి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. 24గంటల్లోనే మూడు లక్షల మందికిపైగా చూశారు. ఇక ఇప్పుడు బీస్ట్‌లో అరబిక్ కుతు సాంగ్ ట్రెండ్ అవుతోంది.
డ్యాన్స్‌కి ఫ్యాన్స్ ఫిదా..
పీవీ సింధు లేటెస్ట్ డ్యాన్స్ వీడియోలో జీన్స్ పాంట్, వైట్ టాప్‌తో మ్యూజిక్‌కి తగ్గట్లుగా రిథమిక్‌గా స్టెప్పులు వేసింది. పీవీ సింధు ఫ్రెండ్స్‌తో పాటు సోషల్ మీడియా ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఏంటి బ్యాడ్మింటన్ స్టార్‌లో ఇంత డ్యాన్స్ టాలెంట్ దాగి ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ డ్యాన్స్ వీడియో ఇంకా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో..ఎన్ని లక్షల వ్యూస్ సంపాధిస్తుందో చూడాలి. పీవీ సింధు వాలకం చూస్తుంటే నిధానంగా ఏదో సినిమాలో యాక్ట్ చేస్తుందేమోననే ప్రచారం కూడా జరుగుతోంది. ఆమధ్య జ్వాలగుత్తా కూడా ఇలాగే క్రీడల్లో రాణించిన తర్వాత నితిన్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేసింది. అయితే అది ఆమెకు పెద్దగా కలిసిరాకపోవడంతో ..మళ్లీ అలాంటి ప్రయోగం చేయలేదు. మరి పీవీ సింధు కూడా అలాంటి ప్రయోగం ఏమైనా చేస్తుందా ఏమి అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.