Home /News /telangana /

HYDERABAD PROJECTS AND RIVERS FILLED WITH FLOOD WATER DUE TO HEAVY RAINS IN TELANGANA SNR

Telangana : వర్షాలు ఆగడం లేదు ..వరద తగ్గడం లేదు తెలంగాణలో పరిస్థితి అస్తవ్యస్థం

(Rain effect)

(Rain effect)

Telangana: ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో పరిస్థితి అస్థవ్యస్థంగా మారింది. చెరువు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీగా వరదనీరు వచ్చి చేరడంతో జలాశయాలు పూర్తిగా నిండుకున్నాయి. కురుస్తున్న వర్షాలకు రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఇంకా చదవండి ...
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో సంభవించిన వాతావరణ మార్పు బీభత్స పరిస్థితుల్ని సృష్టించింది. గత మూడ్రోజులుగా దంచి కొడుతున్న వర్షాలకు ఉమ్మడి సుమారు 8జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీ, నదీ పరివాహక ప్రాంతాలు కలిగిన జిల్లాల్లో ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకుకొని బాహ్యసంబంధాలు కోల్పోయారు. ముఖ్యంగా ఆదిలాబాద్(Adilabad)జిల్లాలో వరదలు పోటెత్తాయి. జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా మారాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు కోతకుగురై, చెట్లు విరిగి రోడ్డిపై పడి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. భారీ వర్షాలకు నిర్మల్(Nirmal)జిల్లాలో నదులకు వరద పోటెత్తుతుంది. ఎస్సారెస్పీ(SRSP), కడెం(Kadem), గడ్డెన్న స్వర్ణ ప్రాజెక్ట్(Swarna) లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వర్షాభావ పరిస్థితుల్ని జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి(Indrakaran Reddy) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

వర్షాలు, వరదలతో విలవిల..
స్వర్ణ ప్రాజెక్ట్ లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వర్ణ ప్రాజెక్ట్ ను సందర్శించి.. ఇన్ ప్లో, అవుట్ ప్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. SRSPలోకి 81 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, లక్ష క్యూసెక్కుల అవుట్ ప్లో, కడెం ప్రాజెక్ట్ లోకి 2 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 2 లక్షల క్యూసెక్కుల అవుట్ ప్లో, స్వర్ణ ప్రాజెక్ట్ లోకి 32 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 27 వేల క్యూసెక్కుల అవుట్ ప్లో, గడ్డెన్న ప్రాజెక్ట్ లోకి 32 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 20,300 క్యూసెక్కుల అవుట్ ప్లో వరద నీటితో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల వల్ల చెరువులు ఇప్పటికే 70 శాతానికి పైగా నిండాయన్నారు. ఎస్సారెస్పీతో పాటు కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్ట్ లోకి భారీ వరదలు వస్తుండటం వల్ల ముందే గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.నిండుకున్న ప్రాజెక్టులు..
ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల ప్రాజెక్ట్ వరద నీటితో నిండు కుండను తలపిస్తుంది. ఇన్ ప్లో 7800 క్యూసెక్ ల వరదనీరు ప్రాజెక్ట్ లోకి రాగ రెండు గేట్ల సహాయంతో 7800 క్యూసెక్ వరద నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 284.30 మీటర్ల నీరు ఉంది. అటు పెంగంగా నది కూడ ఉదృతంగా ప్రవహిస్తోంది. పంటపొలాలు నీట మునిగాయి. ఈ వర్షం ఇలానే కొనసాగితే మాత్రం రైతులు వేసిన పంటలు నష్టపోయే పరిస్థితులు తలెత్తుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Rain Alert : తెలంగాణ ప్రజలపై వర్షపు పిడుగు .. మరో మూడ్రోజుల పాటు అతి భారీ వర్షాలు: IMDజలాశయాల్లోని నీరు దిగువకు..
తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 277.50 మీటర్లు సామర్థ్యం 0.571 t. m. c కాగా ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 4 వేల 3 వందల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా వచ్చిన నీరును వచ్చినట్టుగా 3 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. మంచిర్యాల జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు గోదావరి నిండుకుండలా మారాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురంభీం అడ ప్రాజెక్టులోకి కూడా వరద నీరు భారీగా వచ్చి చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు.

Peddapalli: వర్షాకాలం ఆ వ్యాధులొచ్చే చాన్సుంది : ఆరోగ్యశాఖ అధికారుల హెచ్చరిక

గోదావరమ్మ ఉరకలు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరికి వరదనీరు పోటెత్తింది. ఎగువ నుంచి వస్తున్న నీటితో మంగళవారం ఉదృతంగా ప్రవహించినప్పటికి సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. వరదనీరు పెరగడంతో మంత్రి పువ్వాడ అజయ్‌ అక్కడే బస చేసి ముంపు, వరద బాధిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధికారయంత్రాంగాన్ని సూచనలు చేస్తున్నారు.
తాల‌కు రోడ్ కనెక్టివిటీ పోయే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి చోట్ల రోగులతో పాటు గర్భిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు..
వర్షాలు, వరద పరిస్థితుల నేపధ్యంలో మెదక్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్​రూమ్​ను పరిశీలించిన జిల్లా కలెక్టర్​ హరీశ్​పరిశీలించారు. జిల్లా ప్రజలకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు, విపత్కర పరిస్థితులు ఎదురైతే కంట్రోల్​ రూమ్​ ఫోన్​ నెంబర్లు 08452–223360, 9391942254 లకు ఫోన్​ చేయాలని సూచించారు. రెండు షిఫ్టులలో కంట్రోల్​రూమ్​లో సిబ్బంది ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Heavy Rains, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు