వెంకటేశ్వరస్వామికి భారత పౌరసత్వం ఇవ్వాలి... తెరపైకి వింత డిమాండ్

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఒక్కొక్కరూ ఒక్కో రకమైన విధంగా నిరసన తెలుపుతున్నారు. ఆ ఆలయ పూజారి కూడా వింత వాదన తెరపైకి తెచ్చారు.

news18-telugu
Updated: January 26, 2020, 8:37 AM IST
వెంకటేశ్వరస్వామికి భారత పౌరసత్వం ఇవ్వాలి... తెరపైకి వింత డిమాండ్
వెంకటేశ్వర స్వామి (credit - twitter - Parthiban Shanmugam)
  • Share this:
తెలంగాణలో చిలుకూరి బాలాజీ టెంపుల్ తెలుసుగా... ఆ ఆలయ పూజారి డిమాండే ఇది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టానికి (CAA)కి వ్యతిరేకంగా చాలా రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి కదా... వాటిలో భాగంగానే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి C S రంగరాజన్ ఈ వింత డిమాండ్ తెచ్చారు. శరణార్థులందరికీ పౌరసత్వం ఇస్తున్నప్పుడు... గుళ్లలో దేవుళ్లకు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నిస్తున్నారు. చిలుకూరి బాలాజీ స్వామికి కూడా పౌరసత్వం ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్ మీకు కొంత కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తోందా? అందరికీ అలాగే అనిపిస్తోంది. దీనిపై ఆ పూజారి తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు కదా. అంటే... దేవుళ్లంతా పిల్లలే... అంటే మైనర్లే... కాబట్టి... దేవుళ్ల బదులు పూజారులు, ట్రస్టీలు, కార్యనిర్వహణ అధికారులే కోర్టుల్లో హాజరవుతారు కాబట్టి... దేవుళ్లకు పౌరసత్వం ఇవ్వాలంటున్నారు. దానికీ దీనికీ సంబంధం ఏంటంటే... పౌరసత్వ చట్టం లోని సెక్షన్ 5 (4)... మైనర్‌కి పౌరసత్వ హక్కులు ఇవ్వొచ్చు. అందువల్ల అన్ని ఆలయాల్లోని దేవుళ్లకూ పౌరసత్వం ఇవ్వాలన్నది ఆయన డిమాండ్.

తిరుమలలో వెంకటేశ్వర స్వామికీ, శబరిమలలో అయ్యప్పస్వామికీ, కేరళలో పద్మనాభస్వామికీ... ఆ సెక్షన్ కింద పౌరసత్వం ఇవ్వాలంటున్నారు చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి రంగరాజన్. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఈ డిమాండ్‌ను సీరియస్‌గా తీసుకుంటారో, లేదో తేలాల్సి ఉంది.
Published by: Krishna Kumar N
First published: January 26, 2020, 8:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading