రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి రిట్రీట్‌లు ప్రతి భారతీయుడికి చెందుతాయన్నారు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.సికింద్రాబాద్‌లోని భారత రాష్ట్రపతి నిలయం బుధవారం నుంచి ప్రజల కోసం తెరవబడింది. రాష్ట్రపతి నిలయాన్ని గతంలో ప్రజల సందర్శనకు కేవలం15రోజులు మాత్రమే అనుమతించగా... ఇప్పుడు ఆ సమయాన్ని 11నెలలకు పెంచడంతో హైదరదాబాద్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాష్ట్రపతి నిలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర సాంస్కృతిక పర్యాటకం, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తదితరుల హాజరయ్యారు. వీరి సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రపతి మాట్లాడారు.
గత నెలలో హైదరాబాద్ లోని రాష్ట్ర పతి నిలయంలో బస చేసే అవకాశం దొరికిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర పతి నిలయం చరిత్రకి సంబందించిన పూర్తి విషయాలు నాలేడ్జ్ గ్యాలరీలో లభిస్తాయన్నారు. రినోవెట్ చేసిన కిచెన్ టన్నెల్ ను తెలంగాణ ట్రెడిషనల్ కళతో నిర్మించామన్న ఆమె.. గతంలోనూ రాష్ట్రపతులు వివిధ గార్డెన్స్ ప్రారంభించారని ముర్ము తెలిపారు. ఇప్పుడు తన హయాంలో బట్టర్ ఫ్లై, రాక్, నక్షత గార్డెన్స్, స్టెప్ వెల్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
President Droupadi Murmu graced the opening of Rashtrapati Nilayam, Secunderabad for visitors through video conferencing. She urged people, especially children and youth, to visit the Rashtrapati Nilayam and get connected with their heritage. https://t.co/ps0U49ztMa @RBVisit pic.twitter.com/UrjdA6q8qL
— President of India (@rashtrapatibhvn) March 22, 2023
ప్రజలందరూ రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించాలని రాష్ట్రపతి పిలుపు నిచ్చారు. రాష్ట్రపతి నిలయం వారసత్వ కట్టడం సాధారణ ప్రజలకు తెరవడం ఇదే మొదటిసారి.ఇంతకుముందు, ప్రజలు పరిమిత కాలం పాటు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇక్కడి అందాలను సందర్శించేవారు. రాష్ట్రపతి నిలయం రాష్ట్రపతి దక్షిణాది పర్యటన సమయంలో మినహా ఏడాది పొడవునా సాధారణ ప్రజల కోసం తెరవబడుతుంది. ప్రజలు వారానికి ఆరు రోజులు (సోమవారాలు , ప్రభుత్వ సెలవులు మినహా) ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిలయాన్ని సందర్శించవచ్చు. భారతీయ పౌరులకు ప్రతి వ్యక్తికి రూ. 50 . విదేశీ పౌరులకు రూ. 250 ఎంట్రీ ఫీజు ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News