HYDERABAD PRESIDENT RAM NATH KOVIND IS COMING TO HYDERABAD TODAY AND WILL ATTEND THE RAMANUJACHARYA MILLENNIUM CELEBRATIONS IN MUCHINTHAL PRV
Hyderabad: నేడు హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ముచ్చింతల్‌లోని రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకలకు హాజరు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ఫైల్ ఫోటో)
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు హైదరాబాద్‌కు వస్తున్నారు. ముచ్చింతల్ లోని సమతామూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి సందర్శిచనన్నారు. అక్కడ నిర్వహిస్తున్న రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు ఆయన హాజరుకానున్నారు. పర్యటన వివరాలు పరిశీలిస్తే..
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (President Ramnath kovind) ఈరోజు హైదరాబాద్‌కు వస్తున్నారు. ముచ్చింతల్ లోని సమతామూర్తి విగ్రహాన్ని (statue of Equality) రాష్ట్రపతి సందర్శిచనన్నారు. అక్కడ నిర్వహిస్తున్న రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు (Ramanujacharya millennium celebrations) ఆయన హాజరుకానున్నారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్ పోర్టులో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం పలుకుతారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం జగన్ లతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.
రాజ్‌భవన్‌లోనే బస..
మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో రామ్ నాథ్ కోవింద్ ముచ్చింతల్ కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. అనంతరం చినజీయర్ స్వామితో కలిసి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం రాజ్ భవన్ కు చేరుకుంటారు. ఈ రాత్రికి ఆయన రాజ్ భవన్ లోనే (Raj Bhavan) బస చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు ఆయన తిరిగి ఢిల్లీకి బయల్దేరుతారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
మరోవైపు ఆదివారం హైదరాబాద్‌లో (Hyderabad) ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమల్లోకి రానున్నాయి. ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమాన్ని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సందర్శించనున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే సాధారణ ప్రజల ఎవరు ఈ రోజు ఆశ్రమంవైపు రావద్దని పోలీసులు ఆదేశించారు.
రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దీంతో ఈ మార్గంలో ఎవరినీ అనుమతించడం లేదు. ఈ సమయంలో అటుగా వచ్చే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు (Police) విజ్ఞప్తి చేశారు. ఇక ఆశ్రమానికి వచ్చే వీఐపీ (VIP) వ్యక్తుల వాహనాల పార్కింగ్ కోసం పోలీసు శాఖ ప్రత్యేకంగా స్థాలాలను కేటాయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ (Hyderabad) పట్టణం నుంచి ఆశ్రమానికి వచ్చే వారు తమ వాహనాలను స్వర్ణ భారత్ ట్రస్ట్ వెనకాల పార్క్ చేయాలని సూచించారు. ఇక విజయవాడ, నల్గొండ నుంచి వచ్చే వాహనాలు పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 నుంచి ఆశ్రమం రోడ్డులో గొల్లూరు గ్రామంలో పార్క్ చేయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.