హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bullet Bandi Song: రికార్డులు తీరగరాసేందుకు సై అంటున్న బుల్లెట్ బండి పాట.. త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై రానున్న పాట

Bullet Bandi Song: రికార్డులు తీరగరాసేందుకు సై అంటున్న బుల్లెట్ బండి పాట.. త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై రానున్న పాట

సిల్వర్ స్క్రీన్ పై బుల్లెట్ బండి

సిల్వర్ స్క్రీన్ పై బుల్లెట్ బండి

Bullet Bandi Song: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారిన బుల్లెట్ బండి సాంగ్.. ఇప్పుడు మరో రికార్డుకు సిద్ధమవుతోంది. త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై పాట రానుంది..

  Bullet Bandi Song: కొన్ని ట్రెండ్ ను ఫాలో అయితే.. మరికొన్ని ట్రెండ్ ను సెట్ చేస్తాయి.. ఆ కోవలోకే వస్తోంది నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా.. పాట.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా అదే పాట.. ముఖ్యంగా పెళ్లి వేడుకలు అంటే ఈ పాట తప్పని సరి అయిపోయింది. ఆ పాట లేకుంటే పెళ్లి వేడుకే లేదు అనుకునేంతంగా మారిపోయింది. పెళ్లి చేసుకుంటున్న వధువులు, త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్న వధువులు అయితే ఈ పాటకు స్టెప్పులు నేర్చుకోవడం కామన్ అయ్యింది. డుగు డుగు డుగు అని వాయిస్ రాగానే వేడుక అంతా క్లాప్స్ తో మారు మోగిపోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే ట్రెండ్ అవుతోంది. అటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో బుల్లెట్ పాట మోత మోగిస్తోంది. కేవలం తెలంగాణ (Tealngana)కు మాత్రమే ఈ పాట ఇప్పుడు పరిమితం అవ్వలేదు. పక్క రాష్ట్రాల్లో సైతం ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. యూట్యూబ్ లో ఈ పాట ట్రెండ్ సెట్టర్ అయ్యింది. అలాగే ప్రస్తుతం పలు సినిమా పాటలు రికార్డు వ్యూస్ తో కోట్లు ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా పాన్ ఇండియా మూవీ పుష్ప ఫస్ట్ సింగిల్… దాక్కో దాక్కో మేక కేవలం నాలుగు వారాల్లో 40 మిలియన్ల స్కోరు దాటింది. ఆ తర్వాతొచ్చిన

  పవర్ స్టార్ మూవీ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ 26 మిలియన్లు దాటింది. ఇక మెగాస్టార్ మూవీ ఆచార్య నుంచి మణిశర్మ ఇచ్చిన  మెస్మరైజింగ్ సాంగ్ లాహే లాహే… ఐదు నెలల్లో 86 మిలియన్ల వ్యూస్ తో నడుస్తోంది. అయితే ఈ పాటలన్నింటి రికార్డును బ్రేక్ చేసేందుకు సై అంగోంది బుల్లెట్ బండి పాట.

  మోహన భోగరాజు పాడిన బులెట్ బండి పాట… ఆన్లైన్లో రిలీజై ఐదునెలలైంది. మొదట్లో ఈ పాట పెద్దగా లైమ్ లైట్లోకి రాలేదు. అయితే పెళ్లి జంట బారాత్ లో వేసిన డాన్స్ వీడియోతో.. ఈ పాటకు మెగా లెవల్లో బూస్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఏకంగా 74 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళుతోంది బులెట్ బండి ఒరిజినల్ సాంగ్. లక్ష్మణ్ రాసిన లిరిక్స్ ని మోహన భోగరాజు పాడగా… బాలాజీ ట్యూన్స్ ఇచ్చారు.

  పుష్ప పాట, భీమ్లా నాయక్ పాట ఏవో కొన్ని సెక్షన్స్ కి మాత్రమే రీచ్ అవుతాయి. కానీ.. ఈ డుగుడుగు సౌండ్ మాత్రం ఇంటిల్లిపాదికీ, అన్ని ఏజ్ గ్రూప్స్ కీ ఎక్కేసింది. ముసలీ ముతకా కూడా ఈ పాటకు వీడియోలు చేసి.. వాట్సాప్ స్టేటస్ లు పెట్టుకుంటున్నారు.

  ఇక పెళ్లిల విషయానికి వస్తే.. శ్రీరస్తు శుభమస్తు లాంటి పెళ్లి పాటలు గతంలో చాలా పాపులర్ అయ్యాయి. పెళ్లి వీడియోల్లో వాటి మార్క్ సౌండ్ మాత్రమే వినివిని బోర్ ఫీలయైనట్టు ఉన్నారు. ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది అంటూ.. బుల్లెట్ బండి ట్యూన్ అందుకుంటున్నారు. ఈవెంట్ మేనేజింగ్ కంపెనీలు ఈ పాట కోసం స్పెషల్ సెట్టింగ్స్ డిజైన్ చేసుకుని.. ఆర్డర్ల కోసం గాలం వేస్తున్నారు. సెలబ్రిటీల పెళ్లిళ్లలో జరిగే సంగీత్ లో కూడా ‘బులెట్ బండి’ పాట

  మాండేటరీ అయ్యింది.

  అందుకే బుల్లెట్ బండి క్రేజ్ క్యాష్ చేసుకోడానికి సినిమా వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. బాగా పాపులర్ అయిన ప్రైవేట్ సాంగ్స్ ని ఇంకాస్త రిచ్ గా పిక్చరైజ్ చేసి తెరమీద చూపెట్టి.. తమ సినిమాలకు దాన్నొక కమర్షియల్ ఎలిమెంట్ గా వాడుకోవడం కామన్. ఇప్పుడు

  ‘బులెట్ బండి’పాట కూడా అదే లైన్లోకి రాబోతోంది. రీసెంట్ గా సర్ ప్రైజ్ హిట్ కొట్టిన ఒక డెబ్యూ డైరెక్టర్.. బులెట్ బండి పాటకు పెద్ద మొత్తంలో రాయల్టీ ఇచ్చి రైట్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఒక స్టార్ హీరో సినిమాలో త్వరలో డుగుడుగు పాటను చూసే అవకాశం రానుంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Movie News, Viral, VIRAL NEWS, Viral Video

  ఉత్తమ కథలు