Home /News /telangana /

HYDERABAD PREGNANT WOMAN WHO WENT FOR SEX DETERMINATION DIED AFTER HAVING AN ABORTION IN MEDCHAL MALKAJGIRI DISTRICT SNR

OMG: గర్భిణి విషయంలో చేయకూడని తప్పు చేశారు ఆ డాక్టర్లు .. కప్పి పుచ్చుకునే క్రమంలోనే ప్రాణాలు తీశారు

(ఆ తప్పుకు రెండు ప్రాణాలు బలి)

(ఆ తప్పుకు రెండు ప్రాణాలు బలి)

OMG: ఒక పొరపాటు నిర్ణయం రెండు ప్రాణాల్ని బలిగొంది. లింగ నిర్ధారణ చేయకూడదని ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేయడంతో పాటు కడుపులో ఉన్న పసిగుడ్డును భూమి మీద పడకుండా చూడాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఫలితంగా నెలల పసికందుతో పాటు గర్భిణి కన్నుమూసింది.

ఇంకా చదవండి ...
  ఆ తల్లి మరో నాలుగు ఒపిక పడితే పండంటి బిడ్డకు జన్మనిచ్చేంది. ఆడ సంతానం వద్దు అనుకొని ఆమె తీసుకున్న అనాలోచిత నిర్ణయం చివరకు ప్రాణాలకే ముప్పు తెస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. కడుపులో పెరుగుతున్న పసిగుడ్డుతో పాటు బిడ్డను మోస్తున్న గర్భిణిని వచ్చి రాని వైద్యం చేసి బలితీసుకున్నారు ఆ ప్రైవేట్ ఆసుపత్రిలోని డాక్టర్లు. మేడ్చల్ మల్కాజ్‌గిరి(Medchal Malkajgiri) జిల్లాలో ఈ విషాద సంఘటన కలకలం రేపింది. ఫిర్జాదిగూడ(Firjadiguda)లోని కౌండిన్య ఆసుపత్రి(Koundinya Hospital)లో సంగారెడ్డి(Sangareddy)జిల్లా కేంద్రం రాఘవేంద్రనగర్‌ కాలనీ(Raghavendranagar Colony)కి చెందిన కొత్తగడి కవిత(Kottagadi kavitha) అనే గర్బిణి చికిత్స పొందుతూ చనిపోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే అసలు మృతురాలు కౌండిన్య ఆసుపత్రికి ఎందుకొచ్చింది..అక్కడి వైద్యులు ఆమెకు ఏం చికిత్స చేశారో తెలిసి అందరూ షాక్ అయ్యారు.

  తల్లిలేని వాళ్లైన ఇద్దరు చిన్నారులు..
  సంగారెడ్డి జిల్లా కేంద్రం రాఘవేంద్రనగర్‌ కాలానికి చెందిన కొత్తగడి ప్రవీణ్‌, కవితకు తొమ్మిదేండ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు 8, 5 సంవత్సరాలు కలిగిన ఇద్దరు ఆడపిల్లలున్నారు. ప్రస్తుతం కవిత ఐదు నెలల గర్భిణీ కావడంతో హయత్‌నగర్‌లోని పుట్టింటికి వచ్చింది. శనివారం ఆమెకు స్వల్ప రక్తస్రావం కావడంతో హయత్‌నగర్‌ మండలం తిమ్మాయిగూడెం గౌరవేల్లిలోని RMP డాక్టర్‌ నిరుపా సలహా మేరకు పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పరిధిలోని కౌండిన్య ఆస్పత్రిలో చికిత్స కోసమని అడ్మిట్‌ చేశారు. మూడోసారి గర్భం దాల్చిన కవితకు ఇప్పటికే ఇద్దరు ఆడ సంతానం ఉండటంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ పరీక్షల్లో ఆమె కడుపులో పెరుగుతున్నది ఆడపిల్లేనని తేలడంతో అబార్షన్ చేయించుకోవడానికే ఇష్టపడి ఆసుపత్రిలో వైద్యులు చెప్పినట్లుగా ట్రీట్‌మెంట్‌కి ఆంగీకరించింది.  ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల కక్కూర్తి..
  అబార్షన్ చేసిన డాక్టర్లు ఆదివారం ఉదయం ICU నుంచి జనరల్‌ వార్డుకు షిఫ్ట్‌ చేసారు. ఆమె హెల్త్ కండీషన్‌పై కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దాంతో ఆందోళన చెందిన కవిత తల్లి జనరల్ వార్డుకు వెళ్లి చూడటంతో విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి షాక్ అయింది. వెంటనే డాక్టర్లను పిలిపించి చూపించడంతో అప్పటికే కవిత చనిపోయినట్లుగా నిర్ధారించారు. అయితే అబార్షన్ చేసే క్రమంలోనే కవిత వైద్యం వికటించి మృతి చెందినట్లుగా చెప్పుకుంటున్నారు. మృతురాలికి వైద్యం చేసిన కౌండిన్య ఆసుపత్రి డాక్టర్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోయారు.

  ఇది చదవండి : ఆ పని చేయవద్దన్నందుకు భార్యను కొట్టి, వాతలు పెట్టి చంపిన భర్త .. ఎక్కడంటే  ఆస్పత్రి యాజమాన్యం పరార్‌..!
  పేషెంట్‌ కవిత ఆపరేషన్‌ వికటించడం వల్లే చనిపోయిందనే వార్త స్థానికంగా కలకలం రేపింది. బందువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆసుపత్రి దగ్గరకు చేరుకున్నారు. ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన పేషెంట్‌ని వైద్యులే చంపేశారంటూ బంధువులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. అయితే స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేడిపల్లి సీఐ గోవర్ధన్‌ గిరి ఆసుపత్రి దగ్గర పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.

  ఇది చదవండి: మాజీ ఎమ్మెల్యే తాటి కాంగ్రెస్‌లో చేరికతో ఖమ్మం తెరాసలో ముసలం .. సీతక్క పొలిటికల్ స్కెచ్‌  వైద్యం వికటించి..
  మృతురాలి కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని తనిఖీ చేశారు. పోలీసులు వచ్చిన సమయంలో ఆసుపత్రిలో ఒక్క సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో జజిల్లా వైద్యాధికారి,జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో ఆస్పత్రికి చేరుకున్న మేడ్చల్‌ జిల్లా డిప్యూటీ వైద్యాధికారి నూక నారాయణ రావు,ఏరియా మెడికల్‌ అఫీసర్‌ ప్రతిభ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. చనిపోయిన పేషెంట్ కవిత బెడ్ పక్కనే ఐదు నెలల మృత శిశువు లభించడంతో అబార్షన్‌ కోసం చేసిన ఆపరేషన్‌ విఫలమయ్యే చనిపోయినట్లుగా భావిస్తున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

  ఇది చదవండి : హైదరాబాద్‌ ప్రైవేట్ హాస్పిటల్‌లో పార్టీ .. గర్భిణికి ట్రీట్‌మెంట్‌ అందక పసికందు మృతి  ఆడబిడ్డ అయితేనేం..మగబిడ్డ అయితేనేం
  కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆడైతే ..మగైతేనేం. సుఖ ప్రసవం అయితే చాలు.. పండండి బిడ్డ పుడితే సరిపోతుందని అనుకునే వాళ్లు. కాని కాలక్రమేళన మగసంతానం కోసం తల్లిదండ్రులు చూపిస్తున్న శ్రద్ధతో ఆడ శిశువుల పుట్టుక సంఖ్య తగ్గిపోయింది. ఇలాంది దుష్పరిణామాన్ని అరికట్టడానికి ప్రభుత్వం లింగనిర్ధారణ పరీక్షలు చేయవద్దని చేస్తే నేరమని ఆదేశాలు జారీ చేసింది. ఇది చాలా చోట్ల అమలు అవుతూనే ఉంది. కాని కొన్ని చోట్ల మాత్రం మహిళలు గర్భం దాల్చగానే లింగనిర్ధారణ పరీక్షలు చేయడకూడని వాటిపై కఠిన ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికి తల్లిదండ్రులు ఆశ పడటం వల్లే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Crime news, Telangana News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు