హోమ్ /వార్తలు /తెలంగాణ /

Prank Video: ఫ్రాంక్ వీడియో తీశాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. అసలేమైందంటే..

Prank Video: ఫ్రాంక్ వీడియో తీశాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. అసలేమైందంటే..

ఆ ఘర్షణలో హత్య చేసిన విద్యార్థి తల్లిని మృత్యువాత పడిన విద్యార్థి తీవ్రపదజాలంలో తిట్టాడు. దీంతో తన 

తల్లిని ఎందుకు తిట్టావని స్కూల్ గ్రౌండ్‌లో నిలదీశాడు. అందుకోసం క్షమాపణ చెప్పాలని ఆ విద్యార్థి డిమాండ్ 

చేశాడు. అయితే తిట్టిన విద్యార్థి మాత్రం క్షమాపణ చెప్పేందుకు నిరాకరించాడు. (ప్రతీకాత్మక చిత్రం )

ఆ ఘర్షణలో హత్య చేసిన విద్యార్థి తల్లిని మృత్యువాత పడిన విద్యార్థి తీవ్రపదజాలంలో తిట్టాడు. దీంతో తన తల్లిని ఎందుకు తిట్టావని స్కూల్ గ్రౌండ్‌లో నిలదీశాడు. అందుకోసం క్షమాపణ చెప్పాలని ఆ విద్యార్థి డిమాండ్ చేశాడు. అయితే తిట్టిన విద్యార్థి మాత్రం క్షమాపణ చెప్పేందుకు నిరాకరించాడు. (ప్రతీకాత్మక చిత్రం )

Prank Video: ప్రాంక్‌ వీడియో చిత్రీకరణ ఓ యూట్యూబర్‌ ప్రాణాల మీదకు తెచ్చింది. వీడియో చిత్రీకరణ వివాదానికి దారితీయడంతో దుకాణం యజమాని యూట్యూబర్‌ను చావబాదాడు. నగరంలోని జగదీశ్‌ మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యూట్యూబ్ లో వివిధ రకాల కేటగిరీ వీడియోలను అప్ లోడ్ చేస్తుంటారు. దీని ద్వారా ఎంతో కొంత డబ్బులను సంపాదించొచ్చనే ఆశతో కొంత మంది వంటల వీడియోల దగ్గర నుంచి ఫ్రాంక్ వీడియోల వరకు యూట్యూబ్ లో పెడుతుంటారు. అయితే ఫ్రాంక్ వీడియోల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అవతలి వ్యక్తి దానిని సీరియస్ గా తీసుకుంటే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఇలాంటిదే ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఫ్రాంక్ వీడియో తీసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఫ్రాంక్ వీడియోస్ చేసే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బెడిసి కొట్టే ప్రమాదం ఉంటుంది. కొంతమంది ఇలానే ప్రజలపై ప్రయోగాలు చేస్తూ..చివరకు ఫ్రాంక్ అని ఆటపట్టిస్తుంటారు. తర్వాత ఘర్షణలకు, దాడులకు కారణమౌతుంటాయి.

ఇది ఫ్రాంక్ వీడియో అని ఎంత మొత్తుకున్నా అవతలి వ్యక్తులు వినకుండా దాడులకు దిగుతుంటారు. హైదరాబాద్ లోని ఓ ఛానెల్ కు చెందిన వారు ఫ్రాంక్ వీడియ చేద్దామని ఓ మొబైల్ షాపుకు వెళ్లారు. అక్కడ యజమానితో గొడవకు దిగారు. ఆవేశానికి లోనైన యజమాని ఫ్రాంక్ చేస్తున్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం పోలీసుల వరకు తెలిసింది. ఇంకేముంది ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. హైదరాబాదీ ఫ్రాంక్స్ పేరిట ఓ యూ ట్యూబ్ ఛానల్ ఉంది. వీరు ఫ్రాంక్స్ వీడియోస్ చేస్తుంటారు. ఇలాగే.. ఆబిడ్స్ జగదీష్ మార్కెట్ కు వచ్చారు. అక్కడ ఓ మొబైల్ షాపుకు వెళ్లారు. షాప్ యజమానితో యాంకర్ గొడవకు దిగాడు. ఆ మాట.. ఈమాట చెప్పుకుంటే ఈ గొడవ కాస్త పెద్దదిగా మారింది.

ఆవేశానికి లోనైన షాప్ యజమాని యాంకర్ పై దాడికి పాల్పడ్డాడు. ఇది ఫ్రాంక్ వీడియో అని అక్కడ కెమెరా ఉందని.. కావాలని చేస్తున్నామని యాంకర్ చెప్పినా.. యజమాని వినిపించుకోలేదు. యాంకర్ ను చితకబాదాడు. విషయం ఆబిడ్స్ పోలీసులకు తెలిసింది. ఘటనాస్థలానికి చేరుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు తీసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

First published:

Tags: Attack, Hyderabad, Prank, Youtube channel

ఉత్తమ కథలు