• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • HYDERABAD POUR WATER INSTEAD OF PETROL IN LINGAMPALLY PETROL BUNK SU MDK

Hyderabad: ఆ బంకులో పెట్రోల్‌కు బదులు నీళ్లు.. అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతులు.. వీడియో..

పెట్రోల్‌కు బదులు నీళ్లు..

పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌కు బదులు నీళ్లు రావడంతో వాహనదారుల వాహనాలు చెడిపోయాయి. దీంతో ఆందోళన చెందిన వాహనదారులు పెట్రోల్ బంక్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు.

  • Share this:
    ఓ వైపు పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాహనాలు బయటకు తీయాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్‌ బంకుల యజమానులు కాసులకు కక్కుర్తి పడి పెట్రోల్‌ను కల్తీ చేస్తున్నారు. తాజాగా ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ బదులుగా నీళ్లు వచ్చాయి. అయితే ఇది గమనించి వాహనదారులు పెట్రోల్ బంక్‌ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన BHEL లింగంపల్లి‌లో చోటుచేసుకుంది. వివరాలు.. BHEL లింగంపల్లి సిగ్నల్ దగ్గర HP పెట్రోల్ బంక్ మల్లికార్జున ఫీలింగ్ స్టేషన్ వద్ద కొందరు వాహనదారులు పెట్రోల్ కొట్టించుకున్నారు. ఆ తర్వాత వాహనాలు ముందుకు కదలకపోవడంతో.. అనుమానంతో పెట్రోల్ బంక్‌ సిబ్బందిని ప్రశ్నించారు.

    పెట్రోలుకు బదులుగా పైప్ నుంచి నీళ్లు రావడం గమనించారు. దీంతో పెట్రోలుకు బదులు నీళ్లు పోస్తు అడ్డంగా దొరికిపోయిన బంక్ యాజమాన్యంపై.. వాహనదారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్‌కు బదులు నీళ్లు పోసి తమ వాహనాలను చెడిపోయేలా చేశారని మండిపడ్డారు. అయితే దీనికి బంక్ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. వర్షపు నీటి వల్ల ఇలా జరిగిందని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. అయితే పెట్రోల్‌కు బదులు వర్షపు నీరు అమ్ముతున్నారా అంటూ వాహనదారులు బంక్ యాజమాన్యాన్ని నిలదీశారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.



    ఇక, కొద్ది రోజుల కింద వరంగల్ అర్బన్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. హన్మకొండలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్‌లో.. పెట్రోల్​కు బదులు నీరు వస్తోందని వాహనదారులు ఆందోళన చేపట్టారు. పెట్రోలుకు బదులు నీరు పోశారని వాహనదారులు పెట్రోల్​ బంక్​ వద్ద నిరసనకు దిగారు. నిర్వాహకుల నిర్లక్ష్యంతో లక్షలు విలువ చేసే తమ వాహనాలు చెడిపోయాయని వారు ఆరోపించారు.
    Published by:Sumanth Kanukula
    First published: