Corona effect on marriages: పెళ్లి కాని ప్రసాద్ లు, మిస్సమ్మలు మరి కొంత కాలం ఆగాల్సిందేనా.. ముహూర్తాలు పెట్టుకున్న కుటుంబాల్లో ఆందోళన ..

ప్రతీకాత్మక చిత్రం

Corona effect on marriages: కళ్యాణానికి కరోనా కళ్లెం వేస్తోంది. ఏప్రిల్ 25 నుంచి జూలై 4 వరకు భారీ సంఖ్యలో ముహుర్తాలు ఉన్నాయి. కానీ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ భయంతో వాయిదా వేసుకోవాలా.. తక్కువ మందిని పిలిచి మమ అనిపించుకోవాలో అర్థం కావట్లేదని ముహుర్తాలు పెట్టుకున్న కుబుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 • Share this:
  నగరానికి చెందిన ఓ దంపతులు తన కుమారుడికి జనవరిలో నిశ్చితార్థం పెట్టుకున్నారు. పెళ్లిని మే 13న ఓ భారీ ఫంక్షన్ హాల్లో జరిపించేందుకు నిర్ణయించారు. దానికి కొంత సొమ్ము అడ్వన్స్ కూడా ఇచ్చేశారు. ఇక అతని పరిస్థితి ఎట్లా ఉందంటే ముందు చూస్తే నొయ్యి.. వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా మారింది. మిగతా డబ్బులు ఆ ఫక్షన్ హాలు యజమాని అడుగుతుండగా.. ఇచ్చిన అడ్వాన్స్ ఇచ్చేయండి పెళ్లి వాయిదా వేశాం.. అని చెప్పినా వారు వినడం లేదు. మాకు నష్టం జరిగింది. మమ్మల్ని ఏం చేయమంటారు అంటూ చెబుతున్నారు. ఇలా ఆర్ధికంగా నష్టపోవడమే కాకుండా బంధువులకు సమాచారం ఇది వరకే చెప్పడంతో వారు ఇబ్బందులు పడకుండా పెళ్లి తన సొంత గ్రామం పల్లెటరూరులో పెట్టుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఇలా చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శుభకార్యాలు పెట్టుకున్న కుటుంబాలు, అడ్వాన్సులు తీసేసుకొని ఆ ఏర్పాట్లలో మునిగి ఉన్న నిర్వాహకులను ఇప్పుడు కరోనా కంగారెత్తిస్తోంది. వందల మంది అతిథుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి.. వేడుకను చిరస్మరణీయం చేసుకోవాలని కలలుకన్న వారి ఆశలు నీరుగారిపోతున్నాయి. కొందరు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటుంటే.. ఇంకొందరు మంచి ముహూర్తం మళ్లీ రాదనే భావనతో అతిథుల సంఖ్యను 100లోపునకు కుదించైనా వేడుకను జరిపేందుకే మొగ్గు చూపుతున్నారు.

  కర్ణాకటలో ప్రస్తుతం పెళ్లిళ్లకు అనుమతి లేకపోవడంతో హైదరాబాద్ లో ఫంక్షన్‌ హాల్‌ బుకింగ్ చేసుకున్నారు. ఇక్కడ కరోనా వ్యాప్తి నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ , లాక్ డౌన్ విధించే అవకాశం ఉండటంతో ఆ బుకింగ్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. శుభకార్యాలకు సంబంధించిన బుకింగ్స్‌ నెమ్మదిగా రద్దవుతుండడంతో హాల్స్‌ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం కరోనాతో లాక్‌డౌన్‌, విమానాల రద్దుతో పెళ్లిళ్లు ఆగిపోయాయి. కానీ ఈ సారి ఆ ప్రభావం లేకపోయినా పూర్తిగా బుకింగ్ లు తగ్గాయని ఫంక్షన్ హాల్ యజమానులు వాపోతున్నారు. అంతే కాకుండా మే నెలలో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న వాళ్లు పంక్షన్ హాల్ యజమానులకు అడ్వాన్స్ చెల్లించారు. ఇప్పడు వాటిని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రాత్రి బుకింగ్ చేసుకున్నవారు మధ్యాహ్నానికి మర్చుకుంటున్నారన్నారు.

  ఒకే రోజు 50 వేల పెళ్లిళ్లు..!
  ఏప్రిల్ 25 నుంచి మే చివరి వరకు మంచి ముహుర్తాలు ఉన్నాయి. మే 22 న గొప్ప ముహుర్తం కావడంతో నగరంలో ఒకే రోజు 50 వేల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. జూన్‌, జూలైలో కూడా ముహూర్తాలున్నాయి. ఈ నెలన్నర రోజుల్లో నగరంలో దాదాపు 1.3 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేశారు. చాలా మంది ఫంక్షన్ హాల్లో కాకుండా ఇంటి దగ్గర తక్కువ మంది బంధువుల మధ్య వివాహం జరిపించడానికి మొగ్గు చూపుతున్నారు.
  Published by:Veera Babu
  First published: