ఖననం చేసిన (After Buried) 22 రోజుల తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన నల్లగొండ జిల్లా (Nalgonda) పెద్దఅడిశర్లపల్లి మండలంలోని గుడిపల్లి గ్రామపంచాయతీ సింగరాజు పల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. సింగరాజు పల్లి గ్రామానికి చెందిన రొయ్య నాగమ్మ, సోమయ్యల కుమారుడు యాదగిరి (34) హైదరాబాద్లో (Hyderabad) ఫోటో స్టూడియో నిర్వహించేవాడు. గత నెల 17 వ తేదీన ఫోన్ రావడంతో ఇంటి నుంచి యాదగిరి (Yadagiri) బయటకు వెళ్లాడు. అనంతరం యాదగిరి సాయంత్రం తిరిగి వచ్చాడు. కడుపులో నొప్పిగా ఉందని భార్య విజయలక్ష్మికి తెలియజేయడంతో వెంటనే ఉస్మానియా తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ జనవరి 18వ తేదీ రాత్రి యాదగిరి మృతి చెందాడు. అదేరోజు మృతదేహాన్నిఖననం చేశారు (Buried). అయితే యాదగిరి మరణంపై ఎలాంటి అనుమానాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన ఖననం చేశారు.
ఫోన్లో అనుమానాస్పదంగా వీడియో..
అయితే చాలారోజులుగా యాదగిరి ఫోన్ లాక్ (Phone locked)లో ఉంది. ఇటీవలే అతని తమ్ముడు వెంకటేష్ ఫోన్ అన్లాక్ చేయించాడు. ఇందులో స్నేహితులకు సంబంధించిన వీడియో (Suspicious video) ఫోన్లో రికార్డయింది. దీంతో యాదగిరిని గాయపరచడం వల్లే మృతి చెందాడని అనుమానం వ్యక్తం చేస్తూ (Benefit of doubt) వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఈ నెల 9న ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వనస్థలిపురం ఎస్ఐ జగన్ సంఘటనా స్థలానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి సమక్షంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని (dead body) వెలికి తీయగా దేవరకొండ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
ఇలాంటి ఘటనే మహబూబ్నగర్లో..
కాగా, ఇలాంటి ఘటనే ఒకటి మహబూబ్నగర్లో చోటుచేసుకుంది. అన్న మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో పూడ్చిపెట్టిన మృతదేహానికి 24 రోజుల తరువాత పోస్టుమార్టం నిర్వహించారు. జక్లేర్ గ్రామానికి చెందిన వెంకటేష్ (36) వ్యవసాయం, వడ్రంగి పని చేస్తూ జీవనం సాగించేవారు. గత నెల డిసెంబర్ 13న ఇంటి దగ్గర ఆకస్మికంగా మృతిచెందారు (Died). మరుసటి రోజు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
పాఠశాలకు వచ్చిన ఐదేళ్ల చిన్నారిపై అటెండర్ అఘాయిత్యం..! జగిత్యాల జిల్లాలో ఘటన
కాలికి గాయం ఉన్నట్లు..
అప్పుడే కాలికి గాయం ఉన్నట్లు వెంకటేశ్ తమ్ముడు శ్రీనివాసులు గుర్తించారు. అయితే ఆలస్యం అవుతోందని ఇంట్లోవారు ఖననానికి ఏర్పాట్లు చేశారు. తరవాత అనుమానం బలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం తహసీల్దార్ మజహర్ అలి సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీయించి, అక్కడే పీహెచ్సీ వైద్యుడు నవీన్ కుమార్ రెడ్డి ద్వారా పోస్టుమార్టం చేయించినట్లు ఎస్సై తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.