Home /News /telangana /

Online classes : ఆన్‌లైన్ క్లాసులో ఆ**చిత్రాలు ... వెంటనే ఆఫ్ చేసిన లెక్చరర్స్..!

Online classes : ఆన్‌లైన్ క్లాసులో ఆ**చిత్రాలు ... వెంటనే ఆఫ్ చేసిన లెక్చరర్స్..!

Online classes : ఆన్‌లైన్ క్లాసులో ఆ**చిత్రాలు ... వెంటనే స్క్రీన్లు ఆఫ్ చేసిన లెక్చరర్స్..!

Online classes : ఆన్‌లైన్ క్లాసులో ఆ**చిత్రాలు ... వెంటనే స్క్రీన్లు ఆఫ్ చేసిన లెక్చరర్స్..!

Online classes : ఆన్‌లైన్‌ క్లాసులో దుండగులు పోర్న్ వీడియోను అప్‌లోడ్ చేశారు..సుమారు నలబై నిమిషాలు గల వీడియో ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో అటు విద్యార్థులు ఇటు టీచర్లు చాలా ఇబ్బందిని ఎదుర్కొన్న ఘటన ముంబయిలో వెలుగు చూసింది.

    ఆన్‌లైన్ క్లాసులతో విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది..కరోనా నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్న పరిస్థితుల్లో విద్యార్థులు కొంతమంది పెడదారిన పడుతున్నారు..నిత్యం ఆన్‌లైన్‌లో ఉంటూ అశ్లీల చిత్రాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో వాటిని నేరుగా ఆన్‌లైన్‌ క్లాసుల్లోకి ఆప్‌లోడ్ చేస్తున్న విచిత్ర పరిస్థితి నెలకొంటుంది. మరోవైపు సైబర్ నేరగాళ్లు సైతం పోర్న్ లింకులను గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు.

    ఈ నేపథ్యంలోనే చదువును పక్కన పెట్టి పోర్న్ వీడియోలకు అలవాటుపడుతున్న పరిస్థితి కూడా కొనసాగుతోంది. తాజాగా ముంబయిలో దుండగులు ఆన్‌లైన్ క్లాసుల్లో పోర్న్ వీడియోను పోస్ట్ చేసిన ఘటన వెలుగు చూసింది. విల్లే పార్లెలోని ఓ కాలేజి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు కొనసాగుతుండగా కొంతమంది సైబర్ దుండగులు కాలేజి లింకును హ్యాక్ చేశారు. అనంతరం 40 నిమిషాలు ఉన్న ఓ పోర్న్ వీడియోను గ్రూపులో పోస్ట్ చేశారు. దీంతో మొత్తం క్లాసులో65 మంది క్లాసులు వింటున్నట్టుగా కళాశాల యాజమాన్యం తెలిపింది. హఠాత్పరిమానంతో విద్యార్థులు, లెక్చరర్లు ఖంగు తిన్నారు. వెంటనే తమ స్క్రీన్లను ఆఫ్ చేశారు.

    కాగా విషయం తెలిసిన కాలేజి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆన్‌లైన్ తరగుల వల్ల విద్యార్థుల వద్ద ఎప్పుడు ఫోన్‌లు అందుబాటులో ఉండడం విపరీతమైన పరిణామాలను చోటు చేసుకున్నాయి. దీంతో వారు మానసికంగా కూడా ఇబ్బందులకు గురవుతున్న సంఘటనలు ఎదురవుతున్నాయి. ఈ సంఘటనలతో విద్యార్థుల తల్లి దండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లల మానసిక స్థతిని అంచనా వేయాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Online classes, Porn Movies

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు