హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gambling Case: నాగశౌర్య ఫామ్‌హౌజ్‌లో పేకాట.. అడ్డంగా బుక్కైన మాజీ ఎమ్మెల్యే.. అతడే కీలకం

Gambling Case: నాగశౌర్య ఫామ్‌హౌజ్‌లో పేకాట.. అడ్డంగా బుక్కైన మాజీ ఎమ్మెల్యే.. అతడే కీలకం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gambling Case: బర్త్ డే పార్టీ వేడుకల పేరిట గుత్తా సుమన్ ఒకరోజు ఫామ్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నారు. కానీ లోపల మాత్రం పేకాట ఆడించారు. మరి ఈ విషయం నాగశౌర్య తండ్రికి తెలుసా? లేదా? అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య (Naga Shourya) కు చెందిన ఫామ్ హౌస్‌లో నిషేధిత పేకాట, క్యాసినో కార్యకలాపాలు జరగడంపై దుమారం రేగుతోంది. ఈ కేసులో ఇప్పటికే 30 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు... దీని వెనక ఇంకా ఎవరున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. నాగశౌర్య ఫామ్ హౌస్ గ్యాంబ్లింగ్‌కు అడ్డాగా మారడంతో.. పోలీసులు ఆయన తండ్రికి కూడా నోటీసులు జారీ చేశారు.  రెంటల్ అగ్రీమెంట్‌తో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ (Hyderabad) నగర శివారులోని మంచి రేవుల ప్రాంతంలో నాగశౌర్యకు ఓ ఫామ్ హౌస్ ఉంది. ఆయన తండ్రి రవీంద్ర ప్రసాద్ (Ravindra Prasad) పేరిట లీజు అగ్రిమెంట్ ఉంది. ఆ ఫామ్ హౌస్‌‌ను సినిమా ఆఫీసుగా వాడుతున్నారు నాగశౌర్య.  అప్పుడప్పుడూ అద్దెకు కూడా ఇస్తుంటారు.




ఐతే నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో గుత్తా సుమన్ (Gutta Suman) అనే వ్యక్తి అక్కడ పేకాటా, క్యాసినో వంటి జూదలాలను నిర్వహిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో ఆదివారం సాయంత్రం స్పెషల్ ఆపరేషన్స్ పోలీసులు ఫామ్ హౌజ్‌పై దాడులు చేశారు.  పేకాటతో పాటు క్యాసినో ఆడుతున్న 30 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో రాజకీయ నేతలతో పాటు రియల్ ఎస్టేట్ ప్రముఖులు కూడా ఉన్నారు.  మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. వాసవి డెవలెపర్స్‌కు చెందిన రాజారామ్, మద్దుల ప్రకాశ్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం. గుత్తా సుమన్ కుమార్ హైదరాబాద్ శివారులోని పలు ఫామ్‌హౌస్‌లను అద్దెకు తీసుకొని పేకాట స్థావరాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని కాంటాక్ట్ లిస్ట్‌లో బడా వ్యాపారులు, రాజకీయ నేతలు ఉన్నట్లు తెలిపారు.

Huzurabad Results: హుజురాబాద్" షా "ఎవరు.. సర్వేలు ఏం చెబుతున్నాయి.. అతడిదే గెలుపు అంటూ..

ఐతే ఈ గ్యాంబ్లింగ్ కేసుతో నాగశౌర్యకు గానీ, ఆయన తండ్రికి గానీ సంబంధం లేనట్లు తెలిసింది. నాగశౌర్య తండ్రి పేరిట లీజు అగ్రీమెంట్ ఉన్నప్పటికీ.. కొన్ని రోజులుగా ఆయన బాబాయి బుజ్జియే ఫామ్‌హౌస్‌ను చూసుకుంటున్నట్లు సమాచారం.  బర్త్ డే పార్టీ వేడుకల పేరిట గుత్తా సుమన్ ఒకరోజు ఫామ్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నారు. కానీ లోపల మాత్రం పేకాట ఆడించారు. మరి ఈ విషయం నాగశౌర్య తండ్రికి తెలుసా? లేదా? అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ కేసులో గుత్తా సుమన్‌  పాత్రే కీలకమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. జీఎస్‌కే గ్రూప్ పేరిట విజయవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే గుత్తా సుమన్.. తనకు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లు నమ్మించి, సెటిల్మెంట్లు చేసే వారని ఆరోపణలున్నాయి. సెటిల్మెంట్లు, కబ్జాలతో ఎంతో మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో మరిన్నికీలక వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

First published:

Tags: Hyderabad, Naga shourya, Tollywood

ఉత్తమ కథలు