Revanth Reddy: రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం నేరమా?.. రేవంత్ ఫైర్

(image-Twitter)

గాంధీ ఆస్పత్రికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. బేగంపేటలో ఆయన వాహనాన్ని పోలీసులు నిలివేశారు.

  • Share this:
    గాంధీ ఆస్పత్రికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. బేగంపేటలో ఆయన వాహనాన్ని పోలీసులు నిలివేశారు. దీంతో రేవంత్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గాంధీ ఆస్పత్రి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పేదలకు ఆహారం పంపిణీ చేసేందుకు వెళ్తుంటే తనను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను స్థానిక ఎంపీ అని.. నన్ను ఆపమని చెప్పిందేవడంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరెందుకు వచ్చారు రోడ్డు మీదకి? మీలాగే నేను కూడా రోడ్డు మీదకు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను..’అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.ఓ ఎంపీగా నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి వెళ్తుంటే ఇలా అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి ఏమైన బుద్ది ఉందా అంటూ ఫైర్ అయ్యారు.

    తనను అడ్డుకోవడంపై రాతపూర్వక ఆదేశాలు చూపాలని రేవంత్‌రెడ్డి పోలీసులను డిమాండ్ చేశారు. సామాజిక సేవలోనూ రాజకీయాలు వెతికే ప్రయత్నం దుర్మార్గమని విమర్శించారు. పోలీసులు ఆయనను అడ్డగించిన ఓ వీడియోను కూడా ఎంపీ రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.





    ఇక, సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగులకు అన్నదానం చేసే కార్యక్రమాన్ని ఎంపీ రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లాక్‌డౌన్ ముగిసేవరకు తెలంగాణ కాంగ్రెస్ తరఫున ప్రతిరోజు వెయ్యి మందికి ఉచిత భోజనం అందజేయనున్నట్టు తెలిపారు. కరోనా బారినపడ్డ రోగులు, వాళ్ల కోసం ఆస్పత్రుల దగ్గర ఉంటున్న బంధువులకు ఉచితంగా భోజనం అందించనున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ఆదివారం గాంధీ ఆస్పత్రికి బయలుదేరిన రేవంత్‌రెడ్డిని పోలీసులు బేటంపేటలో అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది.
    Published by:Sumanth Kanukula
    First published: