హోమ్ /వార్తలు /తెలంగాణ /

Flash News: బండి సంజయ్ కు పోలీసుల షాక్..బీజేపీ చీఫ్ సహా 8 మందిపై కేసు నమోదు..ఎందుకంటే?

Flash News: బండి సంజయ్ కు పోలీసుల షాక్..బీజేపీ చీఫ్ సహా 8 మందిపై కేసు నమోదు..ఎందుకంటే?

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు పోలీసులు షాకిచ్చారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా నిన్న బండి సంజయ్ బీజేపీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్న పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుండి యనను హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తుంది. ఇక తాజాగా ఈ ఘటనలో బండి సంజయ్ సహా 8 మందిపై పోలీసులు  చేశారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Kamareddy

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) కు పోలీసులు షాకిచ్చారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా నిన్న బండి సంజయ్ బీజేపీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుండి ఆయనను హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తుంది. ఇక తాజాగా ఈ ఘటనలో బండి సంజయ్ సహా 8 మందిపై పోలీసులు  చేశారు. ఇందులో ఏనుగు రవీందర్ రెడ్డి, వెంకటరమణా రెడ్డి సహా మరో ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. కాగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు 3 రోజుల నుండి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి మద్దతుగా బండి సంజయ్ అక్కడకు వెళ్లి బాధితులకు భరోసానిచ్చి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణలో ఆ అసెంబ్లీ సీటు యమా హాట్ గురూ!..ఎందుకో తెలుసా?

అంతకుముందు మాస్టర్ ప్లాన్‌ను(Master Plan) వ్యతిరేకిస్తూ ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని బండి సంజయ్  (Bandi Sanjay) పరామర్శించారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. వున్న రెండెకరాలు కూడా ఇండస్ట్రియల్ జోన్‌కు పోతుందున్న ఆవేదనతోనే రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం రైతులతో మొండిగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇండస్ట్రియల్ జోన్‌కు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదని బండి సంజయ్  (Bandi Sanjay) స్పష్టం చేశారు. రెండు పంటలు పండించే రైతుల పొలాలను గుంజుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాయడం దీనినే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ఈ ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములు వున్నాయని.. వాటిని ఇండస్ట్రియల్ జోన్‌ కింద తీసుకోవచ్చు కదా అని సంజయ్  (Bandi Sanjay) ప్రశ్నించారు.

బస్సు రన్నింగ్ లో ఉండగా డ్రైవర్ కు గుండెపోటు.. తృటిలో తప్పిన ప్రమాదం..

కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్‌పై కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్‌పై వుందని.. చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలని అన్నారు. లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలన్నారు. తెలంగాణలో రైతులు సమస్యల్ని పట్టించుకోని కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఏం చేస్తారని ప్రశ్నించారు.

మరి కేసు నమోదుపై బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక కామారెడ్డి రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రైతులు వేసిన పిటీషన్ పై సోమవారం ధర్మాసనం విచారణ జరపనుంది.

First published:

Tags: Bandi sanjay, Bjp, Hyderabad, Kamareddy, Telangana

ఉత్తమ కథలు