Video: లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్ టేక్.. లాగితన్నిన ఒంటె..

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పడం ఆ వీడియో ముఖ్యఉద్దేశం.

news18-telugu
Updated: September 1, 2019, 2:46 PM IST
Video: లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్ టేక్.. లాగితన్నిన ఒంటె..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పడం ఆ వీడియో ముఖ్యఉద్దేశం. అయితే, వారు ఎంచుకున్న వీడియో మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఓ ఒంటెలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాయి. అంతలో ఓ యువకుడు లూనా లాంటి ద్విచక్రవాహనం మీద ఒంటెలకు ఎడమవైపు నుంచి ఓవర్ టేక్ చేస్తూ ముందకు వెళ్లబోయాడు. అంతలో ఒంటెకు డౌట్ వచ్చింది. వెనుకవైపు ఎడమకాలుతో ఎగిరితన్నింది. ఇది యాధృచ్ఛికంగా జరిగిన సంఘటనే. అయితే, దాన్ని ట్రాఫిక్స్ రూల్స్‌కి లింక్ చేస్తూ హైదరాబాద్ పోలీసులు వీడియోను షేర్ చేయడం ద్వారా ప్రజలకు సందేశాన్ని పంచారు.



First published: September 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు