Home /News /telangana /

HYDERABAD POLICE SECURITY AT NAGARJUNASAGAR PROJECT DUE TO PROJECTS DISPUTES VRY

Nagarjunasagar : నాగార్జున సాగర్ వద్ద 100 మంది పోలీసులు...ప్రాజెక్టుల సమస్య ..విద్యుత్ సమస్యగా మారిందా..?

Nagarjunasagar :  నాగార్జున సాగర్ వద్ద 100 మంది పోలీసులు...ప్రాజెక్టుల సమస్య ..విద్యుత్ సమస్యగా మారిందా..?

Nagarjunasagar : నాగార్జున సాగర్ వద్ద 100 మంది పోలీసులు...ప్రాజెక్టుల సమస్య ..విద్యుత్ సమస్యగా మారిందా..?

Nagarjunasagar : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటీ ప్రాజెక్టుల సమస్య కాస్తా విద్యుత్ సమస్యగా మారింది...ఏపి ప్రభుత్వ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్ జల విద్యుత్ ప్రాజెక్ట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గతంలో ఏపీ, తెలంగాణ పోలీసులు లాఠీలతో కొట్టుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక దళాలు సాగర్ వద్ద మోహరించాయి.

ఇంకా చదవండి ...
    రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత ఏడు సంవత్సరాల్లో లేని ఉద్రిక్తలు నెలకొన్నాయి..ఇరు రాష్ట్రాల మంత్రులు ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా మాట్లాడుతుండడంతో పాటు నేడు సీఎం జగన్ కూడా ప్రాజెక్టుల నిర్మాణాలపై స్పందిచారు. మరోవైపు తెలంగాణ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండించారు.మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాలు తమ ప్రజల ప్రయోజనాల కోసం ప్రాజెక్టుల నిర్మాణంపై అభ్యంతరాలు తెలుపుతున్నాయి.

    అయితే ప్రస్తుతం నీటీ ప్రాజెక్టుల పంచాయితీ విద్యుత్ ప్రాజెక్టుల వరకు వెళ్లింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటితోపాటు క‌ృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదులు చేసింది. మరోవైపు శ్రీశైలం ఎడమగట్టు కాలువ నీటి మట్టం 834 అడుగులకు పైన ఉన్నప్పుడే విద్యుత్ ఉత్పత్తిని చేయాలని ఏపి చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నీటి మట్టం 823 అడుగులు మాత్రమే ఉండడంతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కోరింది. దీనికి తోడు కేఆర్ఎంబీ కూడా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్రం అన్ని జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలు జారీ చేసింది.

    ఈ నేపథ్యంలోనే ఇరు ప్రభుత్వాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..దీంతో ముందు జాగ్రత్త చర్యగా నాగార్జున సాగర్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాగర్ విద్యుత్ కేంద్రం వద్ద ఎస్పీఎఫ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీరితోపాటు గ్రేహౌండ్స్ దళాలు సైతం నాగార్జున సాగర్ వద్దకు చేరుకున్నాయి. దీంతో స్వయంగా నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

    గతంలో ఏపీ, తెలంగాణ పోలీసులు లాఠీలతో కొట్టుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక దళాలు సాగర్ వద్ద మోహరించాయి.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Nagarjuna sagar, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు