Home /News /telangana /

HYDERABAD POLICE RAIDED A HOUSE IN VANASTHALIPURAM IN HYDERABAD CITY WHILE PROSTITUTION WAS GOING ON PRV

Hyderabad: వీళ్లు మామూలోల్లు కాదు బాబోయ్​.. మహిళతో ఒప్పందం చేసుకుని ఇంట్లోనే వ్యభిచారం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చేస్తూ హైటెక్ స్టైల్లో నిర్వహిస్తున్న వ్యభిచారం చేస్తున్నారు కొందరు కిలాడీలు. తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నప్పటికి అధికారులకు దొరకకుండా హైటెక్ ప్రాసెస్‌లో ఈ వ్యభిచారం నడుస్తోంది.

  తెలంగాణ (Telangana)లోని హైదరాబాద్‌ (Hyderabad) అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుతున్నారు కొందరు కేటుగాళ్లు. మెట్రో సిటీ నుంచి గ్లోబల్‌ సిటీ(Global City)గా మారడంతో ఇక్కడి యువతను మత్తులో ముంచేస్తున్న డ్రగ్స్(Drugs)దందా ఓవైపు... ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చేస్తూ హైటెక్ స్టైల్లో నిర్వహిస్తున్న వ్యభిచారం (Prostitution) మరోవైపు. తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నప్పటికి అధికారులకు దొరకకుండా హైటెక్ ప్రాసెస్‌లో ఈ వ్యభిచారం నడుస్తోంది. తాజాగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై వనస్థలిపురం పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్​లోని శారదానగర్‌ కాలనీ ఫేజ్‌–3లో ఉండే వరదవాణి (60) తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది.

  ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మహిళ (36) వరదవాణికి పరిచయం అయ్యింది. తాను వ్యభిచారం చేస్తానని, వచ్చిన డబ్బులో సగం ఇస్తానని ఒప్పందం చేసుకుంది. గురువారం రాత్రి వరదవాణి ఇంట్లో ఆ మహిళ వ్యభిచారం చేస్తుండగా, పోలీసులు దాడి చేశారు. మహిళతో పాటు భగవాన్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1500 నగదును, 3 సెల్‌ఫోన్ల స్వాధీనం చేసుకున్నారు.

  ఆన్‌లైన్‌లోనే సాగుతున్న దందా..

  ఇటీవలె హైదరాబాద్​లో ఇలాంటి ఘటన ఒకటి బయటపడింది. సరూర్‌నగర్‌(Saroor Nagar)డివిజన్ అనీల్‌కుమార్‌ కాలనీ (Anilkumar Colony)లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం(Monday)పోలీసులు అరెస్ట్ చేశారు.ఏమాత్రం అనుమానం రాకుండా అంతా ఆన్‌లైన్‌(Online)లోనే సాగుతున్న ఈ దందాపై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో రైడ్ చేశారు. అనీల్‌కుమార్‌ కాలనీలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొనున్న నిర్వాహకులు అందులో అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ మురికి వ్యాపారం చేస్తుంది ఇక్కడి వాళ్లు కాదని పోలీసులు గుర్తించారు.  వెస్ట్ బెంగాల్‌కి చెందిన 31సంవత్సరాల సాగర్‌ మొండల్(Sagar Mondal)అలియాస్ బిల్లుతో పాటు రోహన్ మండల్(Rohan Mondal)అనే మరో 22ఏళ్ల యువకుడు ఈదందాని నిర్వహిస్తూ పట్టుబడ్డారు. అంతే కాదు వ్యభిచారం కోసం అమ్మాయిలను కూడా పశ్చిమ బెంగాల్‌(West Bengal)నుంచే తీసుకొస్తున్నారని పోలీసులు తమ విచారణలో రాబట్టారు.

  ఇకపై పీడీ యాక్టేనట..

  వెస్ట్ బెంగాల్‌లోని నిరుద్యోగ అమ్మాయిలకు ఉద్యోగాలిప్పిస్తామని ఆశ చూపించి ఇక్కడికి పిలిపిస్తున్నారు. అటుపై డబ్బు ఆశ చూపించి వ్యభిచార రొంపిలో దించినట్లుగా తేల్చారు. ఇక విటులను ఆకర్షించేందుకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో బిజినెస్ చేస్తున్నారు. ఓ వెబ్‌సైట్‌లో అమ్మాయిల ఫోటోలను పెట్టి కస్టమర్ల ద్వారా మనీ ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్ చేయించుకొని అమ్మాయిలను సప్లై చేస్తున్నారని తేలింది.  రాష్ట్రంలో డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ సర్కారు వ్యభిచారం అరికట్టడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే జంటనగరాల పరిధిలో ఎక్కడ వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడినా వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా పీడీ యాక్ట్‌ లాంటి కఠినమైన సెక్షన్లపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామంటున్నారు పోలీసులు
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Hyderabad, Hyderabad police, Prostitution

  తదుపరి వార్తలు